"ఈ వేసవిలో 14 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు జెన్కో అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లే జెన్‌కో పక్కా ప్రణాళికలు రచిస్తోంది. సమృద్ధి వర్షాలతో వరిసాగు విస్తీర్ణం పెరిగింది. మార్పిడి విధానంలో విద్యుత్ సమీకరణ జరుగుతోంది. కాళేశ్వరం విద్యుత్ వినియోగంపై అపోహలే ఎక్కువగా ఉన్నాయి. గతేడాది 12 వందల మెగావాట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అభ్యర్థనలతో కేంద్రం నుంచి లోన్స్ పునరుద్ధరణ జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సంపూర్ణ భరోసా ఉంది. ఈ ఏడాది రూ. 10 వేల కోట్ల కేటాయించింది. ప్రతీ నెల రూ. 833 కోట్లు సర్కార్ నుంచి విడుదల చేస్తోంది. రూ. 30 వేల కోట్లతో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ బలపడుతోంది. నష్టాల నుంచి త్వరగానే బయటపెడతాం.
పంపుసెట్లకు మీటర్ల బిగింపు రాష్ట్రంలో లేనట్లే. కేంద్రం సైతం పునరాలోచనలో ఉంది. స్మార్ట్ మీటర్ల బిగింపునకు మరో 3 ఏళ్లవుతుంది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులు త్వరలో పూర్తి చేస్తాం. బొగ్గు ధర పెరగుదల వల్లే డిస్కంలకు నష్టాలొస్తున్నాయి. సాగుకు ఉచిత విద్యుత్ భారమవుతోంది." -ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు