- Traffic Awareness : మాదాపూర్-కూకట్‌పల్లి మార్గంలో వాహనం మొరాయించి రహదారిపై నిలిచిపోతే... క్షణాల్లో వాహనాలు బారులు తీరతాయి. అదే ఉదయం/సాయంత్రమో అయితే గమ్యం చేరేందుకు గంటల సమయం ఎదురు చూడాల్సిందేనా! అవసరం లేదు. సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న సిబ్బంది 3 నిమిషాల్లో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు చేరవేస్తారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే.. 5 నిమిషాల్లో ఎస్‌హెచ్‌వో, 10-15 నిమిషాలకు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులకు చెబుతారు. సాఫీగా ప్రయాణం సాగేలా తక్షణమే చర్యలు చేపడతారు.
-
Helmets save lives.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) April 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Always wear a proper helmet and strap it properly. #RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/NagGtilNBC
">Helmets save lives.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) April 6, 2022
Always wear a proper helmet and strap it properly. #RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/NagGtilNBCHelmets save lives.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) April 6, 2022
Always wear a proper helmet and strap it properly. #RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/NagGtilNBC
-
- రాయదుర్గం-గచ్చిబౌలి మార్గంలో పైవంతెన కింద కూడలి. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు ఎవరూ గమనించట్లేదనే భావనలో ఉంటారు. అటువంటి సమయంలో అకస్మాత్తుగా మైక్ నుంచి ఫలానా నంబరు బైక్/కారు జీబ్రాలైన్ దాటిందనో.. హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోలేదనో అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. అప్పటికీ దారికి రాకుంటే.. వారి వాహనం నంబరుతో జరిమానా విధించినట్టే లెక్క.
-
మీ జీవితం విలువ ఒక ఫోన్ కాలో, ఒక మేసేజో కాదు.....
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) April 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/1gztQ3kuo8
">మీ జీవితం విలువ ఒక ఫోన్ కాలో, ఒక మేసేజో కాదు.....
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) April 5, 2022
బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/1gztQ3kuo8మీ జీవితం విలువ ఒక ఫోన్ కాలో, ఒక మేసేజో కాదు.....
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) April 5, 2022
బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/1gztQ3kuo8
-
- సర్కారు కొలువులకు యువత సన్నద్ధమవుతున్నారు. పోటీ పరీక్షల్లో విజేతగా నిలిచేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.. చరిత్ర, భూగోళం, ఆర్థికం తదితర అంశాలపై పట్టు సాధించే పనిలో పడ్డారు. ఉద్యోగార్థులకు ఉపకరించే ప్రశ్నలు.. ఆ పక్కనే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే అంశాలను సామాజిక మాధ్యమాల్లో పొందుపరుస్తున్నారు.
-
Don't Text or Answer a call while driving. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/T6W2MwOX5g
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Don't Text or Answer a call while driving. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/T6W2MwOX5g
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 31, 2022Don't Text or Answer a call while driving. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/T6W2MwOX5g
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 31, 2022
-
Cyberabad Traffic Police : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాలను వేదికగా మలచుకున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విటర్.. ఇలా ప్రతిచోట ట్రాఫిక్ పాఠాలు నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏవో నాలుగు మాటలు.. మరికొన్ని హెచ్చరికలు చేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో గాకుండా.. సృజనాత్మకతకు రూపమిచ్చి అవగాహన కల్పిస్తున్నామంటున్నారు. ప్రతిరోజూ 4-5 వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఐటీ, కార్పొరేట్ సంస్థలు, ఉద్యోగులు అధికంగా ఉన్న సైబరాబాద్ పరిధిలో ఈ విధానం ప్రజలకు ఉపయోగకరంగా మారింది. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 15 రోజులకు ఒకసారి ట్రాఫిక్ నియంత్రణ, చర్యలపై సమీక్షిస్తున్నారు. అఖండ, పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్.. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టుగా శిరస్త్రాణం, అతివేగం, మద్యం మత్తులో వాహనం నడపటం, సీటు బెల్ట్ ధరించటం వంటి అంశాలను సినిమా పాత్రల ద్వారా చెప్పిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
-
మనకేం అవుతుంది లే అనే నిర్లక్ష్యమైన ఆలోచన విధానం వద్దు. రోడ్డు పై ప్రతి క్షణం ప్రమత్తంగా ఉండండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/ZXMzxWa1CQ
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">మనకేం అవుతుంది లే అనే నిర్లక్ష్యమైన ఆలోచన విధానం వద్దు. రోడ్డు పై ప్రతి క్షణం ప్రమత్తంగా ఉండండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/ZXMzxWa1CQ
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 21, 2022మనకేం అవుతుంది లే అనే నిర్లక్ష్యమైన ఆలోచన విధానం వద్దు. రోడ్డు పై ప్రతి క్షణం ప్రమత్తంగా ఉండండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/ZXMzxWa1CQ
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 21, 2022
వావ్.. యూట్యూబ్ ఛానల్
Traffic Rules Awareness : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు యూట్యూబ్ ఛానల్‌కు లక్ష మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇటీవలే యూట్యూబ్ నిర్వాహకుల నుంచి సిల్వర్ ప్లే బటన్ అవార్డు అందుకున్నారు. రహదారి భద్రత, వాహనదారుల నిబంధనలపై ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు అందించే సలహాలు, సూచనలతో కూడిన వీడియోలను ఛానల్‌లో ఉంచుతున్నారు. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన రహదారి ప్రమాదాల వీడియోలను ప్రదర్శిస్తూ.. అందుకు దారితీసిన కారణాలు, వాహనదారుల తప్పిదాలను వివరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాల బారినపడి కోలుకున్న బాధితుల అనుభవాలు, గాయపడిన వ్యక్తులకు వైద్యసేవలు అందించిన వైద్యులు పంచుకున్న అంశాలను యూట్యూబ్ ద్వారానే దగ్గర చేస్తున్నారు.
- ఇదీ చదవండి : 'నా భార్యను లక్ష రూపాయలకు అమ్మేశాడు.. న్యాయం చేయండి'