హైదరాబాద్‌లో రేపు (11న) జరగబోయే మహానగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ వివరాలు..
- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వైపు వచ్చే అన్ని వాహనాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మళ్లించనున్నారు.
- ట్యాంక్‌బండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం నుంచి వెళ్లే వాహనాలను తెలుగు తల్లి వంతెన వద్దకు మళ్లిస్తారు.
- లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను కట్టమైసమ్మ ఆలయం, తెలుగుతల్లి వంతెన మీదుగా మళ్లించనున్నారు.
- హిమాయత్‌నగర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్, రవీంద్రభారతి మీదుగా మళ్లించనున్నారు.
- బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు రాకపోకలు సాగించే వాహనాలను... పీసీఆర్ కూడలి, రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు.
- తెలుగుతల్లి కూడలి నుంచి ఆదర్శ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, మీదుగా మళ్లించనున్నారు.
- బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి వచ్చే వాహనాలను.. అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి బషీర్‌బాగ్ వంతెన పక్క నుంచి పీసీఆర్ కూడలి, రవీంద్రభారతి, ఇక్భాల్ మినార్ వైపు మళ్లిస్తారని అధికారులు తెలిపారు.
పోలీసులు విధించిన ఆంక్షలను వాహనదారులందరూ పాటించి తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసు అదనపు కమిషనర్ అనీల్ కుమార్ కోరారు.