ETV Bharat / city

రూల్స్ పాటిస్తే సినిమా టికెట్ ఉచితం

రోడ్డు భద్రత నియమాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ట్రాఫిక్​ పోలీసులు ముందుకొచ్చారు. అన్ని నియామాలు సక్రమంగా పాటించిన వాహనదారులకు సినిమా టికెట్లతో పాటు పుష్పగుచ్చాలచ్చి అభినందించారు ట్రాఫిక్​ అదనపు డీసీపీ భాస్కర్​..

రూల్స్ పాటిస్తే సినిమా టికెట్ ఉచితం
author img

By

Published : Aug 17, 2019, 5:35 PM IST

రూల్స్ పాటిస్తే సినిమా టికెట్ ఉచితం

రహదారి నియమాలపై వాహనదారులకు మరింత అవగాహన పెంచేందుకు హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీస్​ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్​ నియమాలను సక్రమంగా పాటించేవారని గుర్తించి సినిమా టికెట్లు ఇచ్చి అభినందిస్తున్నారు. ఇందుకోసం పీవీఆర్​ మాల్స్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

అందరూ టికెట్లు తీసుకోవాలి

ఇవాళ ట్రాఫిక్​ అదనపు డీసీపీ భాస్కర్​ ఆధ్వర్యంలో సికింద్రాబాద్​లో.. రహదారి భద్రత నియమాలు పాటిస్తున్న వారికి సినిమా టికెట్లతో పాటు పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు. నగరంలోని ప్రతీ వాహనదారుడు సినిమా టికెట్లు అందుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రతి నెల పీవీఆర్​ మాల్స్​ వారు ఆరు వందల టికెట్లను అందిస్తున్నారన్నారు. నగర వ్యాప్తంగా 80 శాతం వాహనదారులు ట్రాఫిక్​ నియమాలు పాటిస్తున్నారని పేర్కొన్నారు.

నిబంధనలు పాటించిన వారిని సత్కరించినట్లే.. రూల్స్ పాటించని వారి పట్ల కఠినంగా ఉంటామని కూడా పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చూడండి: బీఆర్కే భవన్​కు వెళ్లే​ మార్గంలో ట్రాఫిక్​ ఆంక్షలు

సికింద్రాబాద్ యాంకర్..సికింద్రాబాదులో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు..సికింద్రాబాద్ సంగీత వద్ద గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడిషనల్ డిసిపి భాస్కర్ ఆధ్వర్యంలో నియమ నిబంధనలను పాటిస్తున్న వాహనదారులకు పివిఆర్ థియేటర్లో సినిమా టికెట్ లతోపాటు పుష్పాలను ఇచ్చి అభినందించారు....ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నియమ నిబంధనలు సక్రమంగా పాటిస్తూ చాలాన్ లు సక్రమంగా కడుతున్న వారిని అభినందించడం జరిగింది అన్నారు..సరైన నిబంధనలను పాటించడం వల్ల అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు..నగర వ్యాప్తంగా ప్రతినెల పివిఆర్ సినిమా మాల్ వారితో కలిసి ఆరు వందల టిక్కెట్లను వాహనదారులకు ఇస్తున్నట్లు వెల్లడించారు..హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించేందుకు వారిలో ప్రోత్సాహాన్ని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్పష్టం చేశారు.ఇప్పటివరకు నగర వ్యాప్తంగా 80 శాతం మంది వాహనదారులు నియమ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నట్లు హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై అడ్డదారి మార్గంలో వెళుతున్న వారి సంఖ్య తగ్గిందని అన్నారు..నియమ నిబంధనలు పాటించి ప్రతి ఒక్క హైదరాబాద్ వాసి ఈ గౌరవాన్ని అందుకోవాలని అన్నారు.ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును చాలన్ రూపంలో కట్టడం బాధాకరమని ఇప్పటికైనా అందరూ అవగాహనతో మెలగాలన్నారు...బైట్ భాస్కర్ అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.