Operation rope giving good results: హైదరాబాద్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలకు తోడు రహదారులపై ట్రాఫిక్ రద్దీ కూడా అధికమైంది. గమ్యస్థానాలు చేరుకోవాలంటే ఎక్కువ సమయం రోడ్డు పైనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. తక్కువ దూరానికే గంటల సమయం ప్రయాణం చేస్తూ నిత్యం చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్తున్న అంబులెన్స్‌లు సైతం ఇరుక్కుపోతున్నాయి.
దీంతో పాటు కొందరు వాహనదారులు ఏ మాత్రం ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమ వాహనాలను ఇష్టారీతిగా నడిపిస్తున్నారు. ఫలితంగా ఇతరులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను సరైన రీతిలో నియంత్రించకపోతే బెంగళూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు... హైదరాబాద్ వాసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసు అధికారులు ఆపరేషన్ రోప్ పేరిట ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
నగర రహదారులపై రాకపోకలు సాగించే వాహనాదారులు ఏ మాత్రం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయిన జరిమాన తప్పదు. గత రెండు రోజులుగా అన్ని కూడళ్లలో నిబంధనలు పాటించే విధంగా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కూడళ్ల వద్ద స్టాప్ లైన్ దాటితే 100 రూపాయలు, ఫ్రీ లెప్ట్‌కు ఆటంకం కల్పిస్తే వెయ్యి రూపాయలు, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే 600 రూపాయలు..... ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు పాటించని వాహనాదారులు నిఘా కెమెరాలకు చిక్కిన భారీ జరిమానాలు తప్పవని స్పష్ట చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని.....రోడ్లపై సజావుగా రాకపోకలు సాగించేలా సహకరించాలని పోలీసులు వాహనాదారులను కోరుతున్నారు.
ఇవీ చదవండి: