ETV Bharat / city

మందు బాబుల వీరంగం.. రెచ్చిపోయిన పోలీసులు - కాకినాడ తాజా వార్తలు

ఏపీ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయారు. మద్యం తాగి వాహనం నడుపుతున్నారని ఇద్దరు వ్యక్తులపై విరుచుకుపడ్డారు. సర్పవరం సెంటర్ నుంచి తన్నుకుంటూ స్టేషన్​కు తీసుకు వెళ్లారు. విచక్షణ మరచి ప్రవర్తించారు. పోలీసులకే ఎదురు చెప్తారా అని బూటు కాళ్లతో తన్నారు. అంతటితో ఆగకుండా లాఠీలు విరిగేలా చావబాదారు. నవంబర్​ 1న జరిగిన ఈ ఘటన వీడియో.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

traffic-police-beat-drinker-at-kakinada
మందు బాబుల వీరంగం.. రెచ్చిపోయిన పోలీసులు
author img

By

Published : Nov 7, 2020, 2:12 PM IST

ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయారు. మద్యం తాగి వాహనం నడుపుతున్నారని ఇద్దరు వ్యక్తులపై విరుచుకుపడ్డారు. సర్పవరం సెంటర్ నుంచి తన్నుకుంటూ స్టేషన్​కు తీసుకు వెళ్లారు. నవంబర్​ 1న చోటు చేసుకున్న ఈ ఘటన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సర్పవరం సెంటర్​లో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా ఇద్దరు మందు బాబులు వేగంగా వచ్చి ఓ కారును ఢీ కొట్టారు. అక్కడే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు మందుబాబుల వాహనం ఆపడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇద్దరు మందుబాబులపై కారులో ఉన్న మహిళతో ఫిర్యాదు చేయించారు.

మందు బాబుల వీరంగం.. రెచ్చిపోయిన పోలీసులు

ఇదీ చదవండి: దుబ్బాకలో దారుణం.. ఇద్దరు కుమార్తెల గొంతు కోసిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.