ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడంతో నగరంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో ఇటీవల రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు ఎలాంటి ఇండికేటర్ వేయకుండా కుడి వైపు నుంచి ఎడమ వైపుకు రావడంతో బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు చిన్న గాయాలతో బయట పడ్డాడు. ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.