ETV Bharat / city

కరోనాపై ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతోంది: ఉత్తమ్ - ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వార్తలు

కరోనాను అరికట్టే విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా... చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవడం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వైద్య సిబ్బందికి సకాలంలో కనీసం పీపీఈ కిట్లు కూడా సరఫరా చేయలేదని ఆరోపించారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్ధాలు, దొంగ లెక్కలు చెబుతూ... వాస్తవాలను దాచేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు.

uttam kumar reddy
uttam kumar reddy
author img

By

Published : Jul 28, 2020, 10:03 PM IST

కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్ధాలు, దొంగ లెక్కలు చెబుతూ... వాస్తవాలను దాచేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ మంచి సలహాలు ఇచ్చినా... స్వీకరించకుండా రాజకీయ దురుద్దేశంతో అవాకులు చెవాకులు పేలుతూ వస్తోందని ధ్వజమెత్తారు. కరోనాను అరికట్టే విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా... చీవాట్లు పెట్టినా తన పద్ధతి మార్చుకోవడం లేదని అన్నారు.

సీఎం స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారు

రాష్ట్రంలో వైద్య సిబ్బందికి సకాలంలో కనీసం పీపీఈ కిట్లు కూడా సరఫరా చేయలేదని ఉత్తమ్ ఆరోపించారు. దేశంలోనే అతి తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని పేర్కొన్నారు. ఈ దారుణాలను... బయటపెట్టి ప్రజలను కాపాడేందుకు గవర్నర్‌ను కలిసి వివరిస్తే... సీఎం కేసీఆర్ స్థాయిని మరిచి విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. సకాలంలో ఆక్సిజన్ అందక 38 మంది చనిపోయారని హైకోర్టు ప్రశ్నించిందన్నారు.

ప్రభుత్వానికి నియంత్రణ లేదు

ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పీపీఈ కిట్లు, సరిపడా మాస్కలు, వెంటిలేటర్లు లేవు. ఇంత ఘోరమైన వైఫల్యాలు ఎక్కడ లేవు. ప్రైవేట్ ఆస్పత్రికి పోతే లక్షల రూపాయలు వసూలు చేసి మృతదేహాలను ఇస్తున్నా... వాటిపై ప్రభుత్వం నుంచి ఏలాంటి నిఘా లేదు. నియంత్రణ అంతకంటే లేదు. గాంధీ పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రి అయినా... కూడా ఈ నాలుగు నెలల్లోనే వెయ్యికి పైగా రోగులు చనిపోయారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో, జిల్లాల్లో, ఇళ్లల్లో, ఇతర కొవిడ్ ఆస్పత్రుల్లోని మరణాలను అంచనా వేస్తే ప్రభుత్వ అసలు రూపం బయట పడుతుంది.

-ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి: ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.