ETV Bharat / city

సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ మూడోసారి బహిరంగ లేఖ రాసింది. పేదలకు బియ్యం, నగదు పంపిణీ సక్రమంగా జరగలేదని ఆరోపించింది. అకాల వర్షంతో పంట నష్టపోయి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది. నిర్దేశించిన సమయాల్లోనే రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది.

సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ  లేఖ
tpcc covid 19 task force committee
author img

By

Published : Apr 21, 2020, 10:28 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 7 వరకు లాక్‌డౌన్‌ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ స్వాగతించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మూడో సారి బహిరంగ లేఖ రాసింది. పేదలకు బియ్యం, నగదు పంపిణీ సక్రమంగా జరగలేదని కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. 13.4 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు రూ.1500 నగదు అందలేదని పేర్కొన్నారు.

18 లక్షల తెల్లరేషన్ కార్డుల ధరఖాస్తులు, 4.5 లక్షలు బీపీఎల్ దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. రైతుబంధు లబ్ధిదారులు, తెల్లరేషన్‌ కార్డుదారులు నగదును డ్రా చేయడానికి బ్యాంకర్లు అనుమతించడం లేదని ధ్వజమెత్తారు. అకాల వర్షం, వడగళ్ళు వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రధానంగా మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, సిరిసిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం జగిత్యాల్, కరీంనగర్ జిల్లాల రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పిడుగుపాటుతో మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు.

నిర్దేశించిన తేదీల్లో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నా.. కనీసం నాలుగు నుంచి ఐదు రోజులు నిరీక్షణ తప్పట్లేదని పేర్కొన్నారు. 15 రోజుల్లో రెండు సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగినా.. రైతుల సమస్యలపై చర్చ లేదని ఆందోళన వ్యక్త చేశారు. పసుపు, మామిడి, మిర్చి, బత్తాయి పంటల గిట్టుబాటు ధరలపై కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: స్విగ్గీ భాగస్వామ్యంతో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.