ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలుండవని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కిందపడి చేయికి దెబ్బతగిలిన తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ను రేవంత్ కలిశారు. డీఎస్ తనకు చాలా దగ్గరి మనిషని.. అందుకే పలకరించడానికి వెళ్లానని తెలిపారు.
మరోవైపు.. రేవంత్ తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని డి.శ్రీనివాస్ అన్నారు. కిందపడి చేయికి దెబ్బతగిలిందని తెలుసుకుని.. తనని పలకరించడానికి వచ్చారని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాల్లేవని స్పష్టం చేశారు. వయస్సులో చిన్నవాడైనా.. తన కోసం ప్రత్యేకంగా ఇంటికి వచ్చి పలకరించడం అభినందనీయమని ప్రశంసించారు.