తూర్పు గోదావరి జిల్లా పాపికొండల పర్యాటకంలో పెను విషాదం చోటుచేసుకుంది. దేవీపట్నం మండలం కచులూరు మందం వద్ద గోదావరిలో బోటు ఘోర ప్రమాదానికి గురైంది. బోటులో మొత్తం 62 మంది పాపికొండలకు వెళ్తుండగా ఘటన జరిగింది. గోదావరిలో ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. 24 మంది సురక్షితంగా ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన 16 మందికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాద సమయంలో బోటులో మొత్తం 62 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో హైదరాబాద్‌కు చెందిన 22 మంది, వరంగల్‌కు చెందిన 9మంది పర్యటకులు ఉన్నారు.