ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@9pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news@9pm
టాప్​టెన్ న్యూస్@9pm
author img

By

Published : Aug 25, 2020, 8:59 PM IST

1. పాక్-హ్యాక్!

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్​సైట్​ను పాకిస్థాన్​కు చెందిన వ్యక్తులు హ్యాక్ చేశారు. వెబ్​సైట్​లో పాకిస్థాన్ అనుకూల నినాదాలతో పాటు, భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సందేశాలు పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వెబ్​సైట్ హ్యాక్​కు గురికాగా.. మంగళవారం ఈ విషయాన్ని కిషన్​ రెడ్డి కార్యాలయం ధ్రువీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. సీఎల్పీ యాత్ర

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని సీఎల్పీ నిర్ణయించింది. రేపటి నుంచి వచ్చే నెల అయిదో తేదీ వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో సందర్శించనున్నారు. ఆస్పత్రుల వారిగా క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఈ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టినట్లు భట్టి వివరించారు. సందర్శన అనంతరం ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. భారీగా గంజాయి..

భద్రాచలంలోని అంబేడ్కర్ సెంటర్​లో సీఐ వినోద్ రెడ్డి, ఎసై మహేష్ తనిఖీలు నిర్వహిస్తుండగా భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. ఒక కారు, వ్యాన్​ల​లో 637 కిలోల గంజాయిని... తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.95.60 లక్షలు ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. బంగాల్​పై గురి

మూడంటే మూడు... 2016లో బంగాల్​ శాసనసభ ఎన్నికల్లో భాజపా దక్కిన సీట్ల సంఖ్య. కానీ... 2021లో మాత్రం కనీసం 220 స్థానాలు గెలుచుకుని, అధికారం చేపట్టాలని భావిస్తోంది కమలదళం. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళిక అమలు చేస్తోంది. వినేందుకు ఘనంగా ఉన్నా... ఇంతటి భారీ లక్ష్యాన్ని చేధించడం ఆచరణ సాధ్యమేనా? ఇందుకోసం భాజపా అనుసరిస్తున్న వ్యూహాలేంటి? ప్రత్యర్థి మమతా బెనర్జీని ఢీకొట్టే కమలదళ సారథి ఎవరు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. రికవరీలే ఎక్కువ

కరోనా మరణాల రేటు భారత్​లోనే తక్కువగా ఉందని కేంద్ర వైద్య శాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.5శాతంగా ఉన్నట్లు తెలిపింది. యాక్టివ్‌ కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య 3.4రెట్లు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. రికవరీ రేటు 75.92 శాతానికి చేరినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. రెండో ఉద్దీపన కష్టమే!

ప్రజల్లో కరోనా భయాలు తొలగనిదే కేంద్రం ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా ప్రయోజనం ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ అధికారి స్వామినాథన్​ అభిప్రాయపడ్డారు. మొదటి ప్యాకేజీలో ప్రత్యక్ష నగదు బదిలీని ప్రజలు పూర్తిగా వినియోగించలేదని తెలిపారు. ఫలితంగా కరోనా సంక్షోభం ముగిసిన తర్వాతనే రెండో ప్యాకేజీ వెలువడే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. వ్యూహాత్మకంగా..

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా క్షిపణులపై భారత్ నిఘా మరింత పెంచింది. ఇందుకోసం గగనతల రక్షణ వ్యవస్థతో పాటు ఇతర ఆయుధాలను సరిహద్దులో ఉన్న వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించినట్లు సైన్యం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. జియో సరికొత్త ప్లాన్స్

ఐపీఎల్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. క్రికెట్ ప్రియులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్​లను ప్రకటించింది రిలయన్స్ జియో. ఐపీఎల్ క్రికెట్​​ లైవ్​ ప్రసారం చేసే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ​కూడిన ఆఫర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్ల ధరలు, వ్యాలిడిటీ వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. విదేశీ ఆటగాళ్ల సత్తా!

ఐపీఎల్​లో దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లూ సత్తా చాటుతున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో వారి స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. టీ20 ఫార్మాట్​లో అలాంటి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన టాప్​-5 విదేశీ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందామా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. సమంత.. ఓన్లీ క్యారెట్

కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమతమైన నటి సమంత మిద్దె వ్యవసాయం చేస్తోంది. అందులో భాగంగా ఇంటిపై కొన్ని కూరగాయలతో పాటు పూలమొక్కలను నాటింది. ఇంట్లోకి కావాల్సిన ఆహారాన్ని తానే స్వయంగా పండిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. తాజాగా ఆమె పండించిన క్యారెట్లను చూపిస్తూ.. ఈ వారంతం వరకు క్యారెట్​తోనే వంటకాలను చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.