ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9pm
టాప్​టెన్​ న్యూస్​ @9pm
author img

By

Published : Jul 7, 2020, 8:58 PM IST

1. మనమే​ అత్యల్పం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల రేటు అత్యల్పంగా ఉన్న దేశాల్లో భారత్​ ఒకటని పేర్కొంది కేంద్రం. ప్రతి 10 లక్షల మందిలో కేవలం 505 కేసులు, 14.27 మరణాలు ఉన్నట్లు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తీసుకుంటున్న చర్యలతోనే ఇది సాధ్యమవుతోందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. అసలేం చేశారు?

కొవిడ్ రోగులకు అందిస్తున్న సేవలు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఎస్​ సోమేశ్ కుమార్​తో గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. సర్కారు తీసుకుంటున్న చర్యలను సీఎస్ గవర్నర్​కు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. భాగ్యనగరంలో భయంభయం

జంటన‌గ‌రాల్లో క‌రోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో నమోదవుతోన్న మొత్తం కేసుల్లో 90 శాతం ఇక్కడే వస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఇవాళ కూడా రాజధానిలో భారీగానే కేసులు న‌మోద‌య్యాయి. కరోనా లక్షణాలతో పాటు అనుమానితులు వేల సంఖ్యలో వైద్య పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. ఆంధ్ర పెత్తనం కావాలట..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లయ్యాక కూడా హైదరాబాద్‌పై ఆంధ్రప్రదేశ్ పెత్తనం ఉండాలని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నారా అని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వమే స్వచ్ఛందంగా సచివాలయాన్ని అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదని మంత్రి ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. కేంద్రం జోక్యం చేసుకోవాలి

గవర్నర్ పిలిస్తే ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే గవర్నర్ తన విస్త్రృత అధికారాలను ఉపయోగించి బాధ్యులను విధుల నుంచి తొలగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్రం వెంటనే స్పందించాలని రేవంత్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. ఇస్రో ఇక ప్రైవేటు..!

అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఈ నెల 9 ఛలో శ్రీహరికోట కార్యక్రమం చేపట్టనున్నారు. మద్యం అమ్మకాలకు సడలింపులు ఇవ్వడం వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. గుడ్​న్యూస్​

సినీ పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా మహమ్మారి వల్ల ఆగిపోయిన షూటింగ్​లను తిరిగి ప్రారంభించేందుకు మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడించనుంది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. భారం తగ్గింది

2020-21 విద్యా సంవత్సరానికి గాను 9-12 తరగతుల పాఠ్యప్రణాళికను తగ్గించినట్లు కేంద్రం ప్రకటించింది. 30 శాతం మేర సిలబస్​ను కుదించినట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. బయో సెక్యూర్ టెస్టు

వెస్టిండీస్​తో జరగబోయే టెస్టుకు సన్నాహకాల విషయమై ఇంగ్లాండ్​ బోర్డు కృషిని మెచ్చుకున్నారు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సావ్నే. భారత కాలమానం ప్రకారం మ్యాచ్​, రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ఇన్​స్టాలో రికార్డ్

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె, హీరో వరుణ్ ధావన్ వరుసగా ఇన్​స్టాలో, 50 మిలియన్, 30​ మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను అందుకున్నారు. ఈ క్రమంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.