1. ఘోర ప్రమాదం
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోమిన్‌పేట మండలం చిట్టంపల్లిలో ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'టాటా' ముందుడుగు
రాష్ట్రంలోని సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని టాటా ట్రస్టు భావిస్తోంది. ఈ విషయమై ట్రస్టు ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేను చర్చించారు. త్వరలో విద్యాశాఖతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వీడని ఉత్కంఠ..!
రాష్ట్రంలో పీసీసీ పదవుల భర్తీకి ఏఐసీసీ కసరత్తు కొనసాగుతోంది. 'సమ ప్రాధాన్యం... సముచిత న్యాయం' ప్రాతిపదికన పీసీసీ అధ్యక్ష, ఇతర పదవుల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. పీఠం కోసం పలువురు సీనియర్లు పోటీపడుతున్నందున.... నేతల మధ్య సమన్వయమే లక్ష్యంగా అధిష్ఠానం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగానే సమప్రాధాన్య సూత్రాన్ని అమలుచేయటంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నేడు కీలక భేటీ
కేంద్రంతో చర్చల పునరుద్ధరణపై నేడు రైతు సంఘాలు మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. సాగు చట్టాలపై చర్చించేందుకు ఆహ్వానిస్తూ కేంద్రం తాజాగా లేఖ పంపిన క్రమంలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో రైతులతో తదుపరి చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఐరోపా దేశాలకు స్ట్రెయిన్
కొత్తరకం కరోనా(స్ట్రెయిన్) ఐరోపాలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఎనిమిది దేశాల్లో స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా యువతలో ఎక్కువగా విస్తరిస్తోందని... పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఐరోపా సంచాలకులు హాన్స్క్లూగ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. పోర్చుగల్‌లో వరద
ప్రపంచ దేశాలు క్రిస్మస్ ఉత్సవాల్లో ఉన్న సమయంలో పోర్చుగల్‌లోని మెడీరా ద్వీపాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు తోడు కొండచరియలు విరిగిపడటం వల్ల పోర్చుగీస్‌లోని ఉత్తర ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమవగా.. పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. అనూహ్య గిరాకీ..
కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఔషధాలకు అనూహ్య గిరాకీ లభిస్తోంది. గత పది నెలలుగా పారాసెట్మాల్, అజిత్రోమైసిన్, విటమిన్ మాత్రలు సహా.. యాంటీ-బయోటిక్ మందుల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇక కరోనాకు విరుగుడుగా ఇటీవల వచ్చిన ఫావిపిరవిర్, రెమ్డెసివిర్లకూ మంచి స్పందనే వచ్చింది. అయితే.. క్యాన్సర్ వంటి కొన్ని ఔషధాల వినియోగం క్షీణించగా.. హృద్రోగ విభాగానికి చెందిన మందులు మాత్రం గణనీయమైన వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. వినేశ్‌కు విదేశీ నిధులు
భారత అగ్రశేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విదేశీ శిక్షణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హంగేరిలో 40రోజుల పాటు ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రూ.15.51 లక్షలు మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. మహానటి వర్థంతి
అద్భుత నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మహానటి సావిత్రి. భాష ఏదైనా నటనలో ఎదిగి ఒదిగేది. ఎలా బతకాలో చెప్పడానికీ, ఎలా మరణించకూడదో తెలియజేయడానికీ సావిత్రి జీవితం పెద్ద ఉదాహరణ. ఒక ఆదర్శవంతమైన నటిగా, దర్శకురాలిగా అభిమానులు మహానటిగా కీర్తించిన సావిత్రి వర్థంతి (డిసెంబర్ 26) నేడు. ఈ సందర్భంగా ఆమె వెలుగు నీడలు తెలుసుకుందాం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రజినీ క్షేమమే..
అధిక రక్తపోటుతో అస్వస్థతకు గురికావడం వల్ల ప్రముఖ నటుడు రజనీకాంత్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు రక్తపోటులో హెచ్చతగ్గులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన మరో మరో రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.