1. మీ చేతుల్లోనే..
హైదరాబాద్ భవిష్యత్ మీపైనే ఆధారపడి ఉందని... గొప్పగా పని చేసి నగర వైభవాన్ని పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. సహజత్వాన్ని కోల్పోకుండా, అబద్ధాలు చెప్పకుండా... సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. గాల్లో నడుస్తారా..?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఫుట్‌పాత్‌లు లేకుంటే పాదచారులు గాల్లో నడుస్తారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయవాది తిరుమలరావు పిల్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం... వెంటనే ఆక్రమణలు తొలగించాలని జీహెచ్ఎంసీ, పోలీసులకు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సాగర్‌తోనే ఆరంభం..
సీఎల్పీ చేపట్టిన రైతులతో ముఖాముఖి, పొలంబాట-పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ నివాసంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెరాస ప్రభుత్వ పతనం సాగర్ ఉపఎన్నికతోనే మొదలవుతుందని భట్టి హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నలుగురు అరెస్టు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ అత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా ఆటో డ్రైవర్లుగా గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. విశ్రమించేదే లేదు..
బంగాల్ ఠాకూర్ నగర్లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. సభకు తరలి వచ్చిన భారీ జనాన్ని చూస్తే వచ్చే ప్రభుత్వం భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. స్నేహితుల కోసమే..
సాగు చట్టాలపై లోక్‌సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. వ్యాపారులైన తన స్నేహితులకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రధాని మోదీ వీటిని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఈ చట్టాలు నాశనం చేస్తాయని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారత్ 20.. చైనా 45
తూర్పు లద్దాఖ్‌లో గతేడాది భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా సైనికులు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న దానిపై 'డ్రాగన్' పెదవి విప్పలేదు. అయితే.. ఆ ఘర్షణలో 45 మంది చైనా జవాన్లు మృతి చెందారని రష్యా వార్తాసంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఆ రంగాల్లో పెరిగాయ్..
విద్యా, బోధన విభాగంలో 2021 జనవరిలో నియామకాలు 2020 డిసెంబర్‌తో పోలిస్తే 11 శాతం పెరిగాయి. వివిధ రంగాల్లో గత నెల నియామకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. 2020 జనవరితో పోలిస్తే మాత్రం 19 శాతం తగ్గినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఆ సర్వేలోని విశేషాలు మీ కోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఆటగాళ్ల ధరలు..
ఐపీఎల్ 13వ సీజన్ వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈసారి మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే వారి ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన వేలాల్లో ఏ ఆటగాడు అత్యధిక ధర పలికాడో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'గాడ్సే' షురూ..
యువ నటుడు సత్యదేవ్ హీరోగా 'బ్లఫ్ మాస్టర్' ఫేమ్ గోపీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గాడ్సే'. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.