1. గడువు పెంపు..
రాష్ట్రంలో కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల గడువు ఈ నెల 16 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న పురపాలక సంఘాల పరిధిలో లాటరీ ద్వారా లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నారు. జీహెచ్ఎంసీలో మాత్రం ఈ నెల 19న ఎంపిక నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వస్తాయ్.. పోతాయ్..
నాయకులకు కుటుంబం వారసులుకారని... కార్యకర్తలే వారసులని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని షర్మిల ప్రకటననుద్దేశించి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై 15వ ఆర్థిక సంఘం తీవ్రమైన ఆరోపణలు చేసిందని షబ్బీర్ అలీ తెలిపారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. బామ్మ పోరాటం
తన 20 గజాల స్థలాన్ని కబ్జాచేసి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని... వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట ఎస్సీ కాలనీకి చెందిన ఐలమ్మ అనే వృద్ధురాలు ధర్నా చేసింది. తన భూమి ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఏకాభిప్రాయంతోనే..
ఆర్డినెన్స్ పద్ధతి అనుసరించడం, కాకపోవడం రాజకీయంగా ఏకాభిప్రాయం నెలకొనడంపై ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. ఆర్డినెన్స్ విధానంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మాటల యుద్ధం
బంగాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. దీదీ పాలనలో బంగాల్ సంస్కృతి ప్రమాదంలో పడిందని భాజపా ఆరోపించింది. రాజకీయాలను దీదీ సర్కార్ నేరపూరితంగా మార్చేసిందని మండిపడింది. భాజపాపై ప్రతిదాడికి దిగిన మమత... బంగాల్లో మత విభజన ఉండదని, అన్ని వర్గాల ప్రజలు సామరస్యంగా కలిసే ఉంటారని చెప్పారు. భాజపా పాలిత రాష్ట్రాలతో పోలిస్తే బంగాల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కారణమదే..
రాళ్లలో బలహీనతల కారణంగానే ఉత్తరాఖండ్ వరదలు సంభవించాయని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఏళ్ల తరబడి మంచు గడ్డకట్టడం, కరగడం వల్ల మంచుకొండల్లో బలహీనమైన జోన్లు ఏర్పడి, రాళ్లు కిందరు జారిపడతాయని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ట్రంప్‌పై విచారణ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రెండో అభిశంసన విచారణ జరుగుతోంది. ఈ విచారణతో గత నెల వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిలో ఆయన పాత్రపై సెనేట్ నిర్ణయం తీసుకోనుంది. ట్రంప్ దోషిగా తేలితే మరోసారి అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉండకపోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మళ్లీ మైదానంలోకి..
దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్, లారా మళ్లీ మైదానంలో సందడి చేయనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో వీరు తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకోనున్నారు. ఈ ఏడాది మార్చి 2 నుంచి 21 వరకు భారత్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. పెరిగిన బంగారం
అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ కారణంగా.. దేశీయంగానూ ధరలు పెరిగాయి. 10 గ్రా. బంగారం రూ. 495 పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'శ్రీకారం'
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'శ్రీకారం'.. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్‌మీడియాలో విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.