ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @7pm
టాప్​టెన్​ న్యూస్​ @7pm
author img

By

Published : Dec 10, 2020, 6:57 PM IST

Updated : Dec 10, 2020, 7:17 PM IST

1. ఇదో మైలురాయి

పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భూమి పూజ చేసిన ప్రధాని.. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొత్త పార్లమెంటు భవనం.. ఆత్మ నిర్భర్​ భారత్​ నిర్మాణానికి సాక్షిగా నిలుస్తుందని అన్నారు మోదీ. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశ విభిన్నతను చాటేలా నిర్మించే ఈ భవన నిర్మాణం 2022కల్లా పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. నడ్డాపై దాడి

బంగాల్​లో జేపీ నడ్డా వాహనశ్రేణిపై దాడి విషయంలో భాజపా, టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. దాడి అప్రజాస్వామికమని భాజపా ఆరోపించింది. రాష్ట్రంలో గూండాల పాలన పెచ్చరిల్లిపోతోందని ధ్వజమెత్తింది. అయితే వీటిని ఖండించి టీఎంసీ.. ప్రణాళిక ప్రకారం భాజపా కార్యకర్తలు వారిపై వారే దాడి చేసుకున్నారని చెప్పుకొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కేసీఆర్​ లేకుంటే..

సిద్దిపేట లేకపోతే కేసీఆర్​ లేడు.. కేసీఆర్​ లేకపోతే తెలంగాణ లేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం.. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట పేరులోనే ఓ బలం ఉందన్నారు. సిద్దిపేటతో తనకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. సిద్దిపేటను జిల్లా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్​ను కోరినట్టు చెప్పుకొచ్చారు.

4. హైకోర్టు అనుమతి

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు ఉన్నత న్యాయస్థానం అనుమతి తెలిపింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అంగీకారం తెలిపింది. రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్లాట్ బుకింగ్ విధానాన్ని కోర్టు అనుమతించింది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనను కూడా అంగీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. చర్చిద్దాం రండి..

వ్యవసాయ చట్టాలపై చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. చలికాలంలో, కరోనా పరిస్థితుల్లో నిరసనలు చేస్తున్న రైతుల గురించి ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే నిరసనలు విరమించి.. కేంద్రం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'గేట్స్' భారీ సాయం

కరోనాపై పోరులో పేద, మధ్య ఆదాయ దేశాలకు సాయపడేందుకు బిల్​ అండ్​ మిలిందా గేట్స్​ మరోసారి ముందుకొచ్చింది. తాజాగా 250 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. పరీక్షలు, చికిత్సలు, టీకాలు అందరికీ అందినప్పుడే కొవిడ్​ సమస్య పూర్తిగా సమసిపోతుందని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అయినా మాస్క్​ ఉండాల్సిందే..

కొవిడ్​కు సమీప భవిష్యత్​లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మాస్కు వాడాల్సిన అవసరం ఉందా? భౌతిక దూరం పాటించాలా? వంటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. వాటికి నిపుణుల సమాధానాలు ఇలా ఉన్నాయి... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. బంగారం భారీగా తగ్గింది..

పసిడి, వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.534 తగ్గింది. కిలో వెండిపై రూ.628 తగ్గి.. రూ.63 వేల దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కోహ్లీనే టాప్

ఐసీసీ గురువారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో కోహ్లీ, రోహిత్ శర్మ తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య టాప్-50లోకి ఎంట్రీ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అంత పెద్ద సినిమాలా..?

మన దేశంలో అత్యంత ఎక్కువ నిడివి గల చిత్రాలేంటి? అవి ఎప్పుడు వచ్చాయి? అందులో ఎవరెవరు నటించారు? లాంటి ఆసక్తికర అంశాలే ఈ కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Dec 10, 2020, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.