1. సంక్షేమమే మా ధ్యేయం
సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి క్లస్టర్‌లో నిర్మించిన రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ప్రైవేటు చేతుల్లోకి..
కేంద్ర బడ్జెట్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా స్పందించారు. లాక్డౌన్ తర్వాత మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని అభిప్రాయపడ్డారు. దేశాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వాటా తగ్గింది..
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి పన్నుల వాటా తగ్గింది. గతంతో పోలిస్తే 2 వేల 736 కోట్ల మేర తగ్గిస్తూ.. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఫలితంగా 13వేల 990 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అనుకూలమా? కాదా?
భాజపా నేతలు, కార్యకర్తలపై తెరాసయే దాడులు ప్రారంభంచిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. దాడులకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రామమందిరం నిర్మాణానికి విరాళాల సేకరణలో భక్తులుగా పాల్గొంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సంక్షేమ బడ్డెట్..!
కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మౌలిక వసతులు తదితర రంగాలకు వార్షిక పద్దులో పెట్టపీట వేశారు. ఉద్యోగాల సృష్టి, గ్రామీణాభివృద్ధి, భారత్‌లో తయారీ, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు సెస్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై అదనపు భారం మోపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. చమురు మంట
బడ్జెట్లో సామాన్యుడిపై పెట్రో వాత పడింది. పెట్రోల్, డీజిల్‌పై అగ్రి ఇన్ఫ్రా సెస్ విధిస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు మరింత పెరగనున్నాయి. అదే సమయంలో మద్యం ఉత్పత్తులపై 100శాతం సెస్‌ను విధించనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. లాభాల్లో మార్కెట్లు
బడ్జెట్ 2021-22 ఇచ్చిన ఉత్సాహంతో స్టాక్ మార్కెట్లు సోమవారం హై జంప్ చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,315 పాయింట్ల లాభంతో 48,600 మార్క్ అందుకుంది. నిఫ్టీ 647 పాయింట్లు పెరిగి 14,300లకు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. సుంకం తగ్గింపు
దేశీయ పసిడి తయారీదారులకు ప్రోత్సాహం అందించేలా బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఎగుమతులకు ఊతం అందించేలా చర్యలు చేపట్టింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ప్లాటినం, విలువైన లోహ నాణేలపైనా కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. చెన్నై టెస్టు ఓ గుణపాఠం
టీమ్ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని అన్నాడు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్. లేదంటే అంచనాలు తారుమరయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాడు. నాలుగేళ్ల క్రితం చిదంబరం స్టేడియంలో భారత్‌తో తాము ఆడిన చివరి టెస్టు ఓటమి నుంచి పెద్ద గణపాఠం నేర్చుకున్నామని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'డాక్టర్ జీ' లో రకుల్
విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న కొత్త చిత్రం 'డాక్టర్ జీ'లో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. రకుల్ ఇందులో వైద్య విద్యార్థినిగా కనిపించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.