ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5Pm
టాప్​టెన్ న్యూస్ @5PM
author img

By

Published : Jan 26, 2021, 4:59 PM IST

1. ఎలా జరుగుతున్నాయ్..

కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో కలిసి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రామయ్య కల్యాణానికి ముహూర్తం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవానికి మహూర్తం కుదిరింది. ఏప్రిల్ 21న కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు వైదిక కమిటీ తేదీలు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. భార్యపై కోపంతోనే..!

16 మందిని హత్యచేసిన సీరియల్‌ కిల్లర్‌ కేసులో పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. మొదటి భార్య వదిలేయడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. నిందితుడు 2003 నుంచి వరుస నేరాలకు పాల్పడ్డాడని... అన్ని ఘటనల్లోనూ మహిళలే బాధితులని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. దద్దరిల్లిన దిల్లీ..

నిరసనలతో దేశ రాజధాని దిల్లీ మరోమారు దద్దరిల్లింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇన్ని నెలలుగా శాంతియుతంగా సాగుతున్న రైతుల ఆందోళనలు.. ట్రాక్టర్​ ర్యాలీతో ఉద్రిక్తంగా మారాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. నిరసనకారులు దిల్లీలోనే అనేక ప్రాంతాలకు దూసుకెళ్లారు. ఎర్రకోటపై రైతు జెండాలను ఎగురవేశారు. అనేక ప్రాంతాల్లో పోలీసులు-నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో అంతర్జాల​ సేవలను నిలిపివేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. దీదీకి షాక్..

తృణమూల్​ కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పదవులు రాజీనామా చేస్తున్నట్లు ఉత్తర్​పారా ఎమ్మెల్యే ప్రబీర్​ ఘోషల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'ఆఫీస్ ఆఫ్​ ది ఫార్మర్ ప్రెసిడెంట్'

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. తన అధికారిక కార్యకలాపాల కోసం ఫ్లోరిడాలోని పాల్మ్​ బీచ్​ రోడ్​లో ఓ ఆఫీస్​ను ప్రారంభించారు. కార్యాలయానికి 'ఆఫీస్​ ఆఫ్​ ది ఫార్మర్​ ప్రెసిడెంట్​' అనే పేరు పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. తొలి మహిళా ట్రెజరీ..

ప్రముఖ ఆర్థికవేత్త జానెట్​ యెలెన్ అమెరికా ట్రెజరీ మంత్రిగా ​ నియమితులయ్యారు. 84-15 ఓట్లతో ఆమె నియామకాన్ని సెనేట్ ఆమోదించింది. అమెరికా చరిత్రలో ఈ శాఖ పగ్గాలు ఓ మహిళ చేపట్టడం ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఎంఎస్​ఎంఈలకు ఊరట..

కరోనా వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో భారీ అంచనాల నడుమ ఈ సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు నిర్మలా సీతారామన్​. దీనితో ఈ సారి బడ్జెట్​లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రులు.. వడ్డీ రేట్లు సహా వివిధ అంశాల్లో సడలింపులు కావాలని కోరుతున్నాయి. ఈ అంశంపై ఎఫ్​కేసీసీఐ మాజీ అధ్యక్షుడు డీ మురళీధర్ 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కోహ్లీ స్ఫూర్తితో..

భారత జట్టులో ప్రస్తుతమున్న పోరాట స్ఫూర్తికి కారణం కోహ్లినే అని ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ నాసర్​ హుస్సేన్​ అన్నాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్​తో జరగనున్న టెస్టు సిరీస్​ కఠినంగా ఉండబోతుందని తమ ఆటగాళ్లను హెచ్చరించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. మతిపోతోంది..

సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తన ఫొటోలు పెడుతూ... అభిమానులకు టచ్​లో ఉంటోంది నటి యాషిక ఆనంద్. ఇటీవల పోస్ట్ చేసిన తన హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.