ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jan 28, 2021, 2:59 PM IST

topten news @3pm
టాప్​టెన్​ న్యూస్​ @93pm

1. వంటిమామిడి నుంచి

కలెక్టర్లు, సంక్షేమ శాఖల కార్యదర్శులు, గురుకులాల కార్యదర్శులతో సీఎస్ సోమేశ్​కుమార్​ టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. గురుకులాలు, వసతి గృహాలకు నాణ్యమైన కూరగాయల సరఫరాపై అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలకు వంటిమామిడి నుంచి కూరగాయలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. నడిరోడ్డుపైనే లంచం..

ఆదిలాబాద్ పట్టణంలో నడిరోడ్డుపై లంచం తీసుకుంటున్న పంచాయతీ ఏఈని అనిశా అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. చిన్నారులెక్కడ..?

రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యం, వ్యభిచారానికి సంబంధించిన 8 పిల్స్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటులో జాప్యంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మండిపోతాయ్​..

జనవరి చివరాంకంలోనే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో కాయాల్సిన ఎండలు ఇప్పుడే ఠారెత్తిస్తున్నాయి. ఉత్తర, వాయువ దిక్కుల నుంచి గాలుల ప్రభావం లేకపోవడం వల్లే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ప్రసంగం బహిష్కరణ..!

పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి శుక్రవారం చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించనున్నట్లు 16 విపక్ష పార్టీలు ప్రకటించాయి. సాగు చట్టాలను బలవంతంగా ఆమోదించడానికి నిరసనగా ఇలా చేస్తున్నట్లు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. స్థానికుల ఆందోళన..

సింఘు సరిహద్దును ఖాళీ చేయాలని డిమాండ్​ చేస్తూ కొంతమంది స్థానికులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కొన్ని రోజులుగా ఈ సరిహద్దులో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బైడెన్ కీలక నిర్ణయం

హెచ్​1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పనిచేసుకునేందుకు వెసులుబాటు కల్పించేలా బైడెన్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ గతంలో​ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆపిల్ అదుర్స్​..

లగ్జరీ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. 2020 డిసెంబర్​తో ముగిసిన త్రైమాసిక ఆదాయం 21 శాతం పెరిగి.. ఆల్​టైం రికార్డు స్థాయిని తాకినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో భారత్​లో సంస్థ వ్యాపారాలు రెండింతలైనట్లు తెలిపింది. గత ఏడాది ఆన్​లైన్ స్టోర్​ ప్రారంభించడం, ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించడం ఇందుకు కలిసొచ్చినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆక్సెన్ ఫోర్డ్ వీడ్కోలు

అంపైర్​ ఆక్సెన్ ఫోర్డ్ రిటైర్మెంట్​ కానున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్​లో ఆయన అంపైర్​గా సేవలందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఏప్రిల్ 2న 'సీటీమార్'

గోపీచంద్, తమన్నా ప్రధానపాత్రల్లో సంపత్ నంది తెరకెక్కిస్తోన్న చిత్రం 'సీటీమార్'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.