ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్​ @3pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Dec 6, 2020, 2:57 PM IST

topten news @3pm
టాప్​టెన్ న్యూస్​ @3pm

1. ఎక్కడైనా విజయం మాదే..

దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ విజయదుంధుబి మోగిస్తుందని.... ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాస, మజ్లిస్‌ పార్టీలు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయన్న ఆయన.... 2023లో భాజపానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కాంగ్రెస్ మద్దతు

రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్​ బంద్​కు కాంగ్రెస్​ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. భారత్‌ బంద్‌లో కాంగ్రెస్‌ నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ప్రత్యేక సమావేశం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 11వ రోజు కొనసాగుతోంది. మరోవైపు కర్షకుల నిరసనలకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో సమస్య పరిష్కారం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. పీఓకేలోకి బాలికలు..

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)​కు చెందిన ఇద్దరు బాలికలు ఆదివారం తెల్లవారుజామున సరిహద్దులు దాటి భారత్​లోకి ప్రవేశించారు. అయితే.. వారు పొరపాటును ఇలా వచ్చినట్లు గుర్తించాయి భద్రతా దళాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. తిరుగు ప్రయాణం

చైనా ప్రతిష్టాత్మక మిషన్​ చాంగే-5లో మరో కీలక ఘట్టం ముగిసింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి, రాళ్ల నమూనాలను సేకరించిన అసెండర్​.. ఆదివారం ఆర్బిటర్​తో అనుసంధానమైంది. ఆ నమూనాలను విజయవంతంగా ఆర్బిటర్​లోకి చేర్చింది. ఇక సరైన సమయం చూసుకుని భూమికి తిరిగివచ్చేందుకు ఎదురుచూస్తోంది చాంగే-5. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. క్షీణత 8% లోపే..

కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకన్నా వేగంగా రికవరీ అవుతున్నట్లు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్షీణత 8 శాతం లోపే ఉండొచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. భారత్​ బ్యాటింగ్

తొలి టీ20లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమ్​ఇండియా రెండో మ్యాచ్​లోనూ గెలవాలన్న పట్టుదలతో ఉంది. సిడ్నీ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. పదేళ్ల సహజీవనం..

ప్రముఖ గాయకుడు ఉదిత్​ నారాయణ్​.. డిసెంబరు 1వ తేదీన జరిగిన తన కుమారుడి ప్రేమపెళ్లి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన కొడుకు ఆదిత్యా నారాయణ్​, కోడలు, నటి శ్వేతా అగర్వాల్​ దాదాపు పదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆర్​ఆర్​ఆర్​ సెట్​లో 'భట్'

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. చరణ్ సరసన ఆలియా భట్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధమైంది ఆలియా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. భయంకర ప్రయోగాలు

ఆధునిక యుద్ధాల్లో నెగ్గడానికి అస్త్రశస్త్రాలతోపాటు వాటి వినియోగంలో సైనిక బలగాలకు శిక్షణ ఇవ్వడమూ ఎంతో అవసరం. మరి ఆ శిక్షణ తీసుకునే సైనికులపైనే ప్రయోగాలు చేస్తే? అవును చైనా సరికొత్త ప్రయోగాలకు తెరలేపింది. జవాన్ల సామర్థ్యాలను పెంచడానికి వారిలో జన్యుపరమైన మార్పులు చేసేందుకు ప్రయోగాలు చేపడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.