ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Oct 26, 2020, 3:02 PM IST

topten news @3pm
టాప్​టెన్​ న్యూస్​ @3AM

1. అదే నా లక్ష్యం

హైదరాబాద్​ను మురికివాడలు లేని నగరంగా చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమని.. కేటీఆర్​ స్పష్టం చేశారు. హైదరాబాద్​ కట్టెలమండిలో 120 రెండు పడక గదుల ఇళ్లను ఆయన ప్రారంభించారు. కట్టెలమండిలో ఉండే వారంతా కలిసి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. పునః ప్రారంభం

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ జరిగింది. ఒకటి, రెండు యూనిట్లలో ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. జలవిద్యుత్ కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పూజలు చేసి స్విచ్ఛాన్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఎదురుచూపులు..

తెలుగు రాష్ట్రాల మధ్య దసరా సందర్భంగా అంతర్రాష్ట్ర సర్వీసులు నడవకపోవడం వల్ల అటు ప్రయాణికులు ఇబ్బందులు పడటంతో పాటు ఆర్టీసీ ఆదాయం కోల్పోయింది. ఏటా టీఎస్​ఆర్టీసీ దసరా సందర్భంగా అదనపు బస్సులు నడిపించేది. గతేడాది సమ్మె కారణంగా, ఈ ఏడాది కరోనా నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ కాకపోవడం వల్ల బస్సులను నడిపించలేది. ఈ మేరకు రూ. 2 కోట్లకు పైగా ఆదాయం కోల్పోయినట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు అంచనావేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. బాలుడు బలి

మేడ్చల్ జిల్లా శామీర్​పేటలో బాలుడి మృతి కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. షేర్‌చాట్‌లో వీడియో తీసుకునే క్రమంలో బాలుడు ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు ఉంటున్న ఇంట్లోనే అద్దెకు ఉంటున్న బిహార్‌ వాసి సుదర్శన్‌ శర్మ బాలుడితో షేర్​చాట్ వీడియో తీసే క్రమంలోనే ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. జైలు వెంటనే బెయిల్

బొగ్గు బ్లాక్​ను కేటాయించడంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్​ రేకు శిక్ష ఖరారు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఆయనతో పాటు మరో ఇద్దరికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కొద్ది సమయానికే లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్​ మంజూరైనట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. తీర్పు తిరగబడింది..

ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ఫ్యామిలీకోర్టు అరుదైన తీర్పు ఇచ్చింది. విడాకులు తీసుకోకుండా 10ఏళ్లుగా విడిగా ఉంటున్న ఓ ప్రభుత్వ అధికారిణిని.. ఖర్చుల నిమిత్తం తన భర్తకు భరణం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అదే మేలైన విధానం

కొవిడ్‌ నిర్మూలనకు మరింత సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్‌ అథనోమ్​ పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో అందరికీ వ్యాక్సిన్‌ అందజేసేకంటే.. అన్ని దేశాల్లో కొందరి చొప్పున వ్యాక్సిన్‌ అందజేసే విధానం అనుసరణీయమన్నారు. టీకా విషయంలో జాతీయవాదాన్ని పాటించటం తెలివైన చర్య కాదన్నారు. మహమ్మారి నుంచి సంపూర్ణంగా విముక్తి పొందాలంటే కలసి నడవటం ఒకటే మార్గమనని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. అద్భుత ఇన్నింగ్స్

అబుదాబి వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ను చిత్తు చేసి భారీ లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్​ రాయల్స్ జట్టు. ఈ మ్యాచ్​లో మెరుపు ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్న బెన్​ స్టోక్స్, సంజూ శాంసన్​​ను కొనియాడాడు ముంబయి ఆల్​రౌండర్​ హార్ధిక్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఓ ప్రాంతానికే..!

పొలాండ్​ వ్రోక్లా సిటీలోని ఓ ప్రాంతానికి తన తండ్రి పేరు పెట్టడంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన.. తన తండ్రికి దక్కిన గౌరవం కన్నా ఆనందం ఏముంటుందని ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. రవీనా లుక్‌..

యశ్​ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. ఈ సినిమాలో సీనియర్ నటి రవీనా టాండన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. నేడు (సోమవారం) రవీనా పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.