1. అఖిలక్ష భేటీ
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. గ్రేటర్ పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా సవరణపై సూచనలు స్వీకరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. థియేటర్ల సమస్యలు..
కరోనాతో 6 నెలలుగా ఎంతో నష్టపోయామని థియేటర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15 నుంచి థియేటర్లు తెరిచినా ఒకేసారి ప్రేక్షకులు రారన్నారు. నిర్వాహకులకు కొన్నాళ్లపాటు ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నన్నెవరూ ఆపలేరు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీల బృందం హాథ్రస్‌కు వెళ్లనున్నట్టు ఆ పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. దుఃఖంలో ఉన్న బాధితురాలి కుటుంబసభ్యులకు ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తీ తమను అడ్డుకోలేదని ట్విట్టర్లో పేర్కొన్నారు రాహుల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నో ఎంట్రీ..
ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్లో హత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు రాజకీయ నేతలకు అనుమతులు లేవని అధికారులు తెలిపారు. గ్రామంలో సిట్ దర్యాప్తు పూర్తయిన క్రమంలో ప్రస్తుతానికి మీడియాకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 144 సెక్షన్ అమలులోనే ఉందన్నారు. అయితే.. ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు హాథ్రస్‌కు వెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. క్షిపణి సక్సెస్
బాలాసోర్‌లో శనివారం శౌర్య న్యూక్లియర్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది భారత్. ఉపరితలం నుంచి ఉపరితలంలోని 800 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదించగలదని రక్షణశాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. భారీ ఊరట..
రుణాలపై మారటోరియానికి సంబంధించిన చక్రవడ్డీ విషయంలో రుణగ్రహీతలకు పెద్ద ఊరట. వడ్డీపై వడ్డీని వదులుకునేందుకు సిద్ధమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. 6 నెలల్లో 2 కోట్ల రూపాయల వరకు ఉన్న రుణాలపై వడ్డీ వదులుకుంటామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ప్రపంచస్థాయి అటల్ టన్నెల్
భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అటల్ టన్నెల్ ప్రారంభోత్సవం చారిత్రకమైన రోజుగా అభివర్ణించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ నిర్మాణంతో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కల సాకారమైందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ప్రపంచస్థాయి సొరంగమార్గాన్ని నిర్మించామని ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. కాలిఫోర్నియాలో కార్చిచ్చు
అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. కాలిఫోర్నియాలో దావానలం కారణంగా ఈ ఏడాది 40 లక్షల ఎకరాలు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. గాయాల లీగ్..
ఈసారి ఐపీఎల్‌కు అడుగడుగునా కష్టాలే! మొదట కరోనా కారణంగా లీగ్ వాయిదా పడింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆరు నెలల తర్వాత యూఏఈ వేదికగా మొదలుపెడితే.. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయాలపాలవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ప్రభుకు కరోనా..!
సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నట్టుండి కనిపించకపోతే.. వాళ్లు కొవిడ్-19 బారిన పడ్డారని.. అందుకే బయటకు రావడం లేదని ఇటీవల సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను కరోనా బారినపడ్డానంటూ ఇటీవల నెట్టింట్లో వచ్చిన వార్తలపై ప్రముఖ నటుడు ప్రభు స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.