ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @3 PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @3pm
టాప్​టెన్ న్యూస్ @3 PM
author img

By

Published : Aug 26, 2020, 3:00 PM IST

1. భరోసా కావాలి

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి కారణమైన బాధ్యులపై... కఠిన చర్యలు తీసుకోవాలని జెన్‌కో ఉద్యోగులు డిమాండ్ చేశారు. అమరులైన ఉద్యోగుల కుటుంబాలకు సరైన న్యాయం చేయడంతోపాటు.. ఇప్పుడున్న ఉద్యోగులకు భద్రతపై భరోసా కల్పించాలన్నారు. ప్లాంటు పునరుద్ధరణకు కలిసికట్టుగా శ్రమిస్తామని పునరుద్ఘాటించారు. విద్యుత్ ఉద్యోగుల ఐకాస అధ్వర్యంలో జరిగిన అమరుల సంతాపసభలో వారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు ప్లాంట్‌ను సందర్శించిన జెన్‌కో అంతర్గత కమిటీ... ప్రమాద తీరుపై ఆరా తీసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. డ్రాగన్ పశ్చాత్తాపం

గల్వాన్​ దుశ్చర్య జరిగిన రెండు నెలల తర్వాత ఆ ఘటనపై పశ్చాత్తాప వ్యాఖ్యలు చేసింది చైనా. ఆనాటి ఘర్షణను దురదృష్టకర సంఘటనగా అభివర్ణించింది. ఇలాంటి ఘటనలను ఇరు దేశాలూ కోరుకోవడం లేదని భారత్​లోని చైనా రాయబారి సన్​వీడాంగ్​ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. అఫ్గాన్​లో శిక్షణ

పుల్వామా ఘటనకు సంబంధించి పాకిస్థాన్​లో జరిగిన కుట్రనంతా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అభియోగ పత్రంలో వివరించింది. 2016-17లో జైషే మహమ్మద్​కు వచ్చిన కారు బాంబు దాడి ఆలోచనతో.. అదును చూసి భారత్​లోకి అడుగుపెట్టారు ఉగ్రవాదులు. ఈ బృందం భారత్‌ వచ్చాక జైషే మహమ్మద్‌ అగ్రనాయకత్వం‌ ప్రత్యేకంగా వీరితో 'టచ్‌'లో ఉంది. ఆపరేషన్‌ ఆద్యంతం వారి కనుసన్నల్లోనే జరిగిందని.. ఆ వివరాలన్నింటినీ ఛార్జిషీట్​లో పేర్కొంది ఎన్​ఐఏ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. కోమాలోనే ప్రణబ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యంపై బులెటిన్​ విడుదల చేశారు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు. ప్రస్తుతం వెంటిలేటర్​పైనే ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​కు సంబంధించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. స్పీకర్ అసంతృప్తి

పార్లమెంటరీ కమిటీల భేటీల్లోని సమాచారం బయటకు రావటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. పార్లమెంటులో నివేదిక సమర్పించక ముందు ఏ సమాచారం లీక్​ కాకుండా జాగ్రత్తపడాలని కోరుతూ.. కమిటీల ఛైర్మన్లకు లేఖ రాశారు. ఫేస్​బుక్​ వివాదంపై భాజపా నేతల ఫిర్యాదు మేరకు స్పందించారు స్పీకర్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. పెద్దలకు కాదు..

దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు పేదలందరికీ నేరుగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరముందని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ అన్నారు. వినియోగం ద్వారానే ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టవచ్చని పునరుద్ఘాటించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని ప్రధాని మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. స్పష్టత ఇవ్వండి

రుణాలు, ఈఎంఐలపై మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై కేంద్రం స్పష్టమైన వైఖరి ఏమిటో చెప్పాలని మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ప్రభుత్వ తరఫు న్యాయవాది.. విన్నపం మేరకు ఇందుకు వారం రోజుల గడువు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. భర్త కోసం..

అమెరికా ప్రజల కోసం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పోరాడుతూనే ఉంటారని ఆయన సతీమణి, అగ్రరాజ్య ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్​ అన్నారు. తన భర్తను మరోమారు అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని దేశ ప్రజలను కోరారు. రిపబ్లికన్​ పార్టీ జాతీయ సమావేశంలో భాగంగా ప్రసంగించారు మెలానియా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ఐపీఎల్​లో పరీక్షలు

ప్రస్తుత ఐపీఎల్ సీజన్​లో మొత్తంగా 20 వేలకు పైగా కరోనా టెస్టులు చేయనున్నారు. ఈ విషయాన్ని సదరు హెల్త్ కేర్​ ప్రకటించింది. పరీక్షలతో పాటే ప్రత్యేక వైద్య సదుపాయలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. కేజీఎఫ్​లో ప్రకాశ్ రాజ్

కేజీఎఫ్ సీక్వెల్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని విలక్షణ నటుడు ప్రకాశ్​ రాజ్ ట్వీట్ చేశారు.​ ఆ ఫొటోలను ట్వీట్ చేశారు. ఈ షెడ్యూల్​తో క్లైమాక్స్ ఫైట్ మినహా చిత్రీకరణ పూర్తయినట్లే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.