1. 31వ రోజు..
నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతన్నలు చేస్తోన్న నిరసనలు 31వ రోజుకు చేరాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీ సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టారు అన్నదాతలు. మహిళా రైతులూ వీరికి మద్దతిస్తూ దీక్ష చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. శివార్లలో కబ్జాలు..!
మహానగరం చిగురుటాకులా వణికిపోయిన రోజది. నాటి వరద బీభత్స గురుతులు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. చిక్కిపోయిన చెరువులన్నీ ప్రవాహాన్ని ఆపలేక జనావాసాల్లోకి విరుచుకుపడటంతో ఎన్ని వేలమంది అగచాట్లు చవిచూశారో తెలిసిందే. అయినా ఇటువంటి తటాకాల్లో నెలకొన్న కబ్జాల తొలగింపుపై యంత్రాంగం ఇప్పటికీ దృష్టిపెట్టలేదు. రాజేంద్రనగర్ మండలం గగన్‌పహాడ్ వద్ద అప్పాచెరువు దుస్థితి ఇందుకు నిదర్శనం. ఏకంగా ఆరుగురిని బలిగొన్న ఈ తటాకం వద్ద ప్రస్తుత పరిస్థితిపై ‘ఈటీవీ భారత్' క్షేత్రస్థాయిలో పరిశీలించి అందిస్తోన్న కథనమిది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఇద్దరు దుర్మరణం..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మా గీతే..!
అమ్మానాన్నలను కలుసుకోవాలని ఆమె ఐదేళ్లుగా నిరీక్షిస్తూనే ఉంది. దివ్యాంగురాలైన గీత ఇరవై ఏళ్ల కిందట తప్పిపోయి వేరే దేశంలో పదిహేనేళ్లు గడిపింది. కన్నవారి ఆచూకీ కోసం ప్రభుత్వం చొరవతో తిరిగి వచ్చింది. తమ కూతురేనంటూ ఇప్పటికే చాలా కుటుంబాలు ఆమెకోసం క్యూ కట్టాయి. గీత తమ కూతురేనంటూ తాజాగా మరో కుటుంబం ముందుకొచ్చింది. డీఎన్ఏ పరీక్షకూ తాము సిద్ధమేనని పెద్దపల్లి జిల్లాకు చెందిన బొల్లి స్వామి అన్నారు. గీత వారినీ గుర్తించలేకపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. చిన్న వయస్సులో పెద్ద పదవి..!
21 ఏళ్ల వయసు.. డిగ్రీ రెండో సంవత్సరం చదువు.. ఎలాంటి రాజకీయ చరిత్రలేని కుటుంబం. ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. ఇలాంటి నేపథ్యం ఉన్న ఆ అమ్మాయి ఓ ప్రధాన నగరానికి మేయర్ కాబోతుందంటే ఆశ్చర్యమే కదా.! దేశంలోనే అతి చిన్న వయసులో ఈ పదవి పొందే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు కేరళకు చెందిన ఆర్య రాజేంద్రన్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఇద్దరు హతం..
కర్మీర్‌లో ఇద్దరు తీవ్రవాదుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చురాత్కి చెందిన రాయిస్ అహ్మద్ దర్, ఆష్ముజీకి చెందిన సుబ్జార్ అహ్మద్ షేక్‌గా గుర్తించారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. అఫ్గాన్‌లో 15 మంది
అఫ్గానిస్థాన్‌లోని చోమ్టల్, బలా బొలొక్ జిల్లాల్లో ఆ దేశ రక్షణశాఖ జరిపిన దాడుల్లో 15 మంది తాలిబన్లు హతమయ్యారు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ రక్షణ శాఖ ట్విట్టర్లో స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. బౌలర్లు భళా..
బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య ఆసీస్ 195 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌తోనే సిరాజ్, గిల్.. భారత్ తరఫున టెస్టు అరంగేట్రం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 40 ఏళ్ల 'మాభూమి'
బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ..పాట వింటే చాలు తెలంగాణ సాయుధ పోరాటం గుర్తుకొస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకనుకుంటున్నారా... ఈ సినిమా వచ్చి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి అప్పట్లో నంది, జాతీయ స్థాయిలో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మహేశ్ 'జెంటిల్మన్'
మహేశ్‌తో పనిచేయడం చాలా గర్వంగా ఉందని చెప్పారు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. తనో 'ఫైనెస్ట్ జెంటిల్మన్' అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.