1. మరో 1,983
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1,983 కొవిడ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,02,594కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 1,181 మంది మృతి చెందారు. వైరస్ నుంచి కోలుకుని మరో 2,381 మంది డిశ్ఛార్జీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కాస్త తగ్గుతోంది..!
కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సోమవారం ఒక్కరోజు 61,267 కేసులు నమోదయ్యాయి. మరో 884 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య 66.85 లక్షలకు చేరింది. మరోవైపు.. దేశంలో ఇప్పటివరకు 8 కోట్ల టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అర్జెంటీనాలో ఉద్ధృతి
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.64 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 4,250 మంది మరణించారు. బాధితుల సంఖ్య 3.57 కోట్లకు చేరువైంది. అమెరికా, రష్యా, బ్రెజిల్లో కరోనా తీవ్రత కొనసాగుతుండగా.. యూకేలో మళ్లీ విజృంభిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆరుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వ్యానును ట్యాంకర్ ఢీకొట్టగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మరో అఘాయిత్యం..
రాజస్థాన్‌లో మరో దారుణం జరిగింది. ఓ మహిళపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఘటనను ఫోన్లో చిత్రీకరించి ఎవరికైనా చెబితే సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. మాస్క్ తీసేశారు..
వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రి నుంచి వైట్‌హౌస్‌కు చేరుకున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగవ్వలేదని డాక్టర్లు చెబుతున్నప్పటికీ.. ట్రంప్ తన మాస్క్‌ను తీసేశారు. అనంతరం.. కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని డొనాల్డ్ ట్విట్టర్లో వీడియో విడుదల చేయడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. లాభాల్లో మార్కెట్
స్టాక్ మార్కెట్లలో నాలుగో రోజూ లాభాల పరంపర కొనసాగుతోంది. ఆటో, ఆర్థిక షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలూ లాభాలకు ఊతమందిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. షెడ్యూల్ ప్రకారమే..
షెడ్యూల్ ప్రకారమే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నిర్వహించేందుకు ఐసీసీ మొగ్గుచూపుతోందని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్ తెలిపారు. అయితే డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివరకూ.. శ్రీలంక్, వెస్డిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లు రెండు సిరీస్‌లు చొప్పునే ఆడాయి. ఈ నేపథ్యంలో అన్ని జట్లకు సమానంగా మ్యాచ్‌లు నిర్వహించి... ఐసీసీ ఫైనల్‌ను ఎలా నిర్వహిస్తుందన్నది ఆసక్తికరం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. అనుష్క-విజయ్
హీరో విజయ్ దేవరకొండ-అనుష్క కలిసి ఓ క్రేజీ సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారని టాక్. ఓ కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కించనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ కొత్త అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.