ETV Bharat / city

టాప్​టెన్​​ న్యూస్ @ 11 AM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​​ న్యూస్ @ 11 AM
టాప్​టెన్​​ న్యూస్ @ 11 AM
author img

By

Published : Aug 13, 2020, 10:57 AM IST

1. రాష్ట్రంలో కొత్తగా 1,931 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో బుధవారం (12వ తేదీన) 1,931 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 86,475కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందాగా.. మొత్తం మృతుల సంఖ్య 665కి చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

2. ఓటరుగా నమోదు చేసుకోండి.. 18 ఏళ్లు దాటిన యువతకు అర్హత..

వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువత ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ డా।।శశాంక్‌ గోయల్‌ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

3. త్వరలో అందుబాటులోకి... కొవిడ్‌ నిర్ధరణకు కొత్త యంత్రం

రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణకు మరో కొత్త యంత్రం (కొబాస్‌ 8800 మిషన్‌) అందుబాటులోకి రానుంది. నిమ్స్‌లో ఈ యంత్రాన్ని అమర్చేందుకు రూ.కోటి వ్యయంతో ప్రత్యేక ల్యాబొరేటరీని సిద్ధం చేశారు. దీని ద్వారా ఒక్కరోజులో సుమారు 3 వేలకు పైగా ఆర్‌టీ పీసీఆర్‌ కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి వీలవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

4. దేశంలో కొత్తగా 66,999 కేసులు.. 942 మంది మృతి

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే కొత్తగా 66,999 కేసులు నమోదవగా.. 942 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 23 లక్షల 96 వేలు దాటాయి.

పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

5. 70 శాతం మంది యువత గుండె సమస్యలతో వైద్యుల వద్దకు..!

హైదరాబాద్‌ మహానగరంలో 70 శాతం మంది గుండె వైఫల్యంతో బాధపడుతూ చివరి నిమిషంలో వైద్యులను సంప్రదిస్తున్నారని ఇటీవల జరిపిన అధ్యయనాల్లో గుర్తించినట్టు సీనియర్‌ కార్డియాలజిస్టు, కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ శరత్‌చంద్ర తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

6. '17వ కర్మపా సందర్శనకు అనుమతించండి'

భారత్​ సందర్శనకు బౌద్ధుల గురువైన 17వ కర్మపా ఓ గ్యెన్​ ట్రిన్లే దోర్జేను అనుమతించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సిక్కిం సీఎం ప్రేంసింగ్​ తమాంగ్​. ఇటీవల తలెత్తిన సరిహద్దు తగాదాల నేపథ్యంలో చైనాతో పాటు టిబెట్​, తైవాన్​ల విషయంలో ఇప్పటివరకు ఉన్న వెసులుబాట్లనూ మన దేశం పునఃసమీక్షిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

7. ఆగని కరోనా ఉద్ధృతి- రష్యాలో 9 లక్షల కేసులు.

ప్రపంచదేశాలపై కరోనావైరస్ వినాశకరమైన ప్రభావం చూపుతోంది. కేసులు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 2.75 లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్ల ఏడు లక్షలకు ఎగబాకింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

8. కనిమొళి ఎఫెక్ట్​: స్థానిక భాష తెలిసినవారికే ఆ కొలువు!

దిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ కనిమొళికి ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా సీఐఎస్​ఎఫ్ చర్యలు చేపట్టింది. స్థానిక భాష తెలిసిన సిబ్బందిని చెన్నై విమానాశ్రయంలో నియమించినట్లు తెలుస్తోంది. ఇతర విమానాశ్రయాల్లోనూ స్థానిక భాష సహా ఆంగ్లం తెలిసిన వారిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

9. ఐటీ, లోహరంగం షేర్ల దన్నుతో లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 135 పాయిట్లు లాభపడి 38,504 పాయింట్లకు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

10. టాలీవుడ్​లో మరో దర్శకుడికి సోకిన కరోనా

తొలి సినిమా 'ఆర్ఎక్స్ 100'తోనే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించారు. 'వచ్చేసింది.. త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా' అని ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.