ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news
తెలంగాణ టాప్​టెన్​ న్యూస్
author img

By

Published : Feb 16, 2022, 11:00 AM IST

మేడారంలో వనదేవతల ఆగమనానికి సర్వం సిద్ధమైంది. నేటి సాయంత్రం.. భక్తుల కోలాహలం నడుమ డప్పు వాయిద్యాలు హోరెత్తుతుండగా.. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుది. ఇదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరి.. భక్తుల పూజలందుకుంటారు.

  • ముందు అందలం ఎక్కించి...ఆపై అవమానించి...

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, పోలీస్ బాస్ గా పనిచేసిన గౌతం సవాంగ్​కు ఆ రాష్ట్ర సీఎం జగన్ తొలుత అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఏపీలో 2019 ఎన్నికల నాటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఉండగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏరి కోరి మరీ డీజీపీ స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ ను కూర్చోబెట్టారు. ఇక ఆ ఇద్దరు అధికారులూ కూడా ముఖ్యమంత్రి పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారు. ఈ ప్రభుత్వం మనదన్న భావనతో పనిచేశారు.

  • గురు రవిదాస్ ధామ్​ను దర్శించుకున్న ప్రధాని మోదీ

దిల్లీ కరోల్​బాఘ్​లోని శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. కీర్తనలో పాల్గొన్నారు.

  • కంటైనర్​ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్​ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో జరిగింది.

  • ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం- మైనర్​ అరెస్ట్​

6 ఏళ్ల చిన్నారిపై.. అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు ఓ మైనర్. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.​ అస్సాంలోని హైలాకుండీ జిల్లాలో ఈ దారుణం జరిగింది

  • మ్యూజిక్​ డైరెక్టర్​ బప్పి లహిరి కన్నుమూత.. ప్రధాని సంతాపం

సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి(69) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. బప్పి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • క్వార్టర్​ ఫైనల్​లోకి సానియా మీర్జా జోడీ

దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​ల్​లో సానియా మీర్జా-లూసి హ్రాడెకా జోడీ క్వార్టర్​ ఫైనల్​లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్​లో షుకో(shuko aoyama)-అలెక్సాండ్రా క్రునిక్​ ద్వయంతో తలపడనుంది.

  • 'పూరీ తీసిన ఆ సూపర్ హిట్ సినిమాలో హీరో నేనే అన్నారు.. కానీ...'

దర్శకుడు పూరీజగన్నాథ్​ తెరకెక్కించిన ఓ సూపర్​ హిట్​ చిత్రంలో హీరోగా తనను ప్రకటించిన తర్వాత తప్పుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు సినీనటుడు శ్రీరామ్​. ఒకరి తప్పిదం వల్ల గతంలో తాను ఓ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నట్లు ఆయన తెలిపారు.

  • అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు

అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతల గృహనిర్బంధం

రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ల ముందు ధర్నాలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యనేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

  • మొదలైన జనజాతర..

మేడారంలో వనదేవతల ఆగమనానికి సర్వం సిద్ధమైంది. నేటి సాయంత్రం.. భక్తుల కోలాహలం నడుమ డప్పు వాయిద్యాలు హోరెత్తుతుండగా.. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుది. ఇదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరి.. భక్తుల పూజలందుకుంటారు.

  • ముందు అందలం ఎక్కించి...ఆపై అవమానించి...

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, పోలీస్ బాస్ గా పనిచేసిన గౌతం సవాంగ్​కు ఆ రాష్ట్ర సీఎం జగన్ తొలుత అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఏపీలో 2019 ఎన్నికల నాటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఉండగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏరి కోరి మరీ డీజీపీ స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ ను కూర్చోబెట్టారు. ఇక ఆ ఇద్దరు అధికారులూ కూడా ముఖ్యమంత్రి పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారు. ఈ ప్రభుత్వం మనదన్న భావనతో పనిచేశారు.

  • గురు రవిదాస్ ధామ్​ను దర్శించుకున్న ప్రధాని మోదీ

దిల్లీ కరోల్​బాఘ్​లోని శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. కీర్తనలో పాల్గొన్నారు.

  • కంటైనర్​ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్​ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో జరిగింది.

  • ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం- మైనర్​ అరెస్ట్​

6 ఏళ్ల చిన్నారిపై.. అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు ఓ మైనర్. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.​ అస్సాంలోని హైలాకుండీ జిల్లాలో ఈ దారుణం జరిగింది

  • మ్యూజిక్​ డైరెక్టర్​ బప్పి లహిరి కన్నుమూత.. ప్రధాని సంతాపం

సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి(69) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. బప్పి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • క్వార్టర్​ ఫైనల్​లోకి సానియా మీర్జా జోడీ

దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​ల్​లో సానియా మీర్జా-లూసి హ్రాడెకా జోడీ క్వార్టర్​ ఫైనల్​లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్​లో షుకో(shuko aoyama)-అలెక్సాండ్రా క్రునిక్​ ద్వయంతో తలపడనుంది.

  • 'పూరీ తీసిన ఆ సూపర్ హిట్ సినిమాలో హీరో నేనే అన్నారు.. కానీ...'

దర్శకుడు పూరీజగన్నాథ్​ తెరకెక్కించిన ఓ సూపర్​ హిట్​ చిత్రంలో హీరోగా తనను ప్రకటించిన తర్వాత తప్పుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు సినీనటుడు శ్రీరామ్​. ఒకరి తప్పిదం వల్ల గతంలో తాను ఓ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నట్లు ఆయన తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.