ETV Bharat / city

top ten news : టాప్​ టెన్​ న్యూస్​ @9AM - తెలంగాణ తెలుగు వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

telugu news, telangana news
తెలంగాణ టాప్​టెన్​ న్యూస్
author img

By

Published : Feb 11, 2022, 9:00 AM IST

  • 'శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి ఆపండి'

తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్​లోని నీటిని శ్రీశైలం జలాశయంలోకి రివర్స్ పంపింగ్ చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రతిపాదించింది. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించుకోవద్దని రెండు తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది.

  • ఆ విషయంలో సర్కారుకు ఉపశమనం

కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఉపశమనం లభించింది. జనవరి 14కు ముందే పూర్తయిన పనుల బిల్లుల చెల్లింపు కోసం రూ.572 కోట్ల నిధుల విడుదలకు ఆర్​ఈసీ అంగీకారం తెలిపింది. అటు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం నాబార్డ్ ద్వారా నిధులను సమకూర్చుకోనుంది.

  • 'సివిల్స్‌లో అదనపు అటెంప్ట్స్‌'.. కేంద్ర మంత్రి కీలక సమాధానం

సివిల్ సర్వీసెస్ పరీక్ష-2022కు సంబంధించి అభ్యర్థులకు అదనపు అవకాశాలు ఇచ్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

  • మజ్లిస్‌తో ఎవరికి నష్టం? ఏ పార్టీకి మేలు?

2017లో జరిగిన యూపీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న మజ్లిస్​ (ఏఐఎంఐఎం) పార్టీ.. మళ్లీ బరిలోకి దిగుతోంది. ఈసారి ఉనికి చాటుతుందా? లేదా బిహార్‌ ఫలితాలను పునరావృతం చేస్తుందా? అన్నది యూపీ రాజకీయ వర్గాల్లో చర్చలకు తోవిస్తోంది. గతంలో బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల భాజపాకు మేలు జరిగినట్లు విశ్లేషణలు ఉన్నాయి. దీంతో యూపీ ఎన్నికల్లో ఈ పార్టీ ఎవరి ఓట్లును చీలుస్తుంది? ఏ పార్టీకి మేలు చేస్తుంది? అనేది కూడా కీలక అంశంగా మారింది.

  • అన్ని శాఖల్లో ఖాళీలపై సీఎస్‌ సోమేశ్ కుమార్ సమీక్ష

అన్ని శాఖల్లోని ఖాళీలను గుర్తించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. వీలైనంత త్వరగా వివరాలు మంత్రివర్గానికి నివేదించాలని అన్నారు. ఈ మేరకు కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

  • 'ఉత్తరాఖండ్‌ను అప్పుల్లో ముంచేశారు'

ఉత్తరాఖండ్‌ను పాలించిన ప్రభుత్వాలు గత 22 ఏళ్లలో రూ.72,000 కోట్ల రుణాలు తెచ్చినా ఎలాంటి అభివృద్ధి సాధించలేకపోయాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. అప్పుల రూపేణా తెచ్చిన ఈ డబ్బు అంతా నేరుగా నేతల జేబుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు.

  • చైన్ స్నాచింగ్ చేశారు.. నకిలీ కరెన్సీ బాగోతం బయటపడింది!

పోలీసులు తీగ లాగితే నకిలీ నోట్ల డొంక కదిలింది. ఓ కేసులో దర్యాప్తు చేస్తుంటే... మరో మోసం బయటపడింది. అద్దె పేరుతో ఇంట్లోకి వెళ్లి మహిళ మెడలో నుంచి దొంగలు బంగారు గొలుసులు లాక్కెళ్లారు. కేసు నమోదు చేసి నిందితుల ఇళ్లలో తనిఖీ చేసిన పోలీసులకు.. నకిలీ నోట్లు కంటపడ్డాయి. ఆరా తీస్తే నకిలీ కరెన్సీ బాగోతం బయటపడింది.

  • బ్రిటిష్​ ప్రభుత్వానికి సవాల్​..

క్విట్‌ ఇండియా అంటే... భారత్‌ను విడిచి వెళ్లండంటూ ఆంగ్లేయులను డిమాండ్‌ చేయటం! కానీ కొన్ని ప్రాంతాలు అంతటితో ఆగలేదు. బ్రిటిష్‌ సర్కారును బలవంతంగా గద్దెదింపాయి. సమాంతర సర్కార్లు నడిపాయి. బ్రిటిష్‌ ప్రభుత్వానికి సవాలు విసిరాయి. వీటన్నింటికీ ఇరుసు రైతులే కావటం విశేషం.

  • ఫామ్​లోనే కోహ్లీ.. కానీ: సునీల్ గావస్కర్

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఫామ్‌లోనే ఉన్నాడని.. కానీ అదృష్టం కలిసి రాక స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ ఇటీవల అర్ధ శతకాలు నమోదు చేసినా.. వాటి సెంచరీలుగా మలచలేకపోతున్నాడు.

  • ''డీజే టిల్లు' సినిమాతో రెట్టింపు వినోదం గ్యారంటీ'

తమ నిర్మాణ సంస్థలో కామెడీ థ్రిల్లర్ చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే 'డీజే టిల్లు' చేశామని నిర్మాత నాగవంశీ అన్నారు. శనివారం ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.