ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @7AM - తెలుగు ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TODAY, telangana news
తెలంగాణ టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Feb 6, 2022, 6:59 AM IST

  • దేశ ఐక్యతకు రామానుజులే ప్రేరణ

రామానుజుల విగ్రహంతో భారతదేశం మానవశక్తిని, స్ఫూర్తిని పొందుతుందని, జ్ఞానం, వైరాగ్యం, ఆదర్శాలకు ఈ విగ్రహం చిహ్నమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికీ స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. తెలుగువారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని ప్రధాని కొనియాడారు.

  • సమున్నత మూర్తి.. మహోజ్వల దీప్తి

మహోన్నత దృశ్యం ఆవిష్కృతమైంది.. వెయ్యేళ్ల కిందట అవతరించిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యులు నింపిన స్ఫూర్తిని దిగంతాలకు పరిమళింపజేసే మహాఘట్టం సాక్షాత్కారమైంది. భాగ్యనగర సిగలో అద్భుత ఆభరణం చేరింది.

  • శభాష్​ ఈటల..

హైదరాబాద్​ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ తిరిగి వెళ్తున్న సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. మోదీకి వీడ్కోలు పలికేందుకు భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సహా ప్రముఖులు శంషాబాద్​ విమానాశ్రయానికి వెళ్లారు. ఈ సందర్భంగా.. బండి సంజయ్ ఈటలను ప్రధానికి​ పరిచయం చేశారు. అప్పుడు మోదీ ఏమన్నారంటే..?

  • మళ్లీ తెరపైకి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసుకు సంబంధించిన డిజిటల్‌ రికార్డులు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. కేసుల్లో మనీలాండరింగ్‌ జరిగిందా? లేదా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఆ రికార్డులు తప్పనిసరి అని తెలిపింది. దీంతో వాటిని ఈడీకి అప్పగించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది.

  • మేడారం జాతరకు పార్కింగ్ సిద్ధం

రాష్ట్రంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక మేడారం జాతరకు వాహనాల పార్కింగ్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 1050 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మ మహా జాతర జరగనుంది. పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా జాతరకు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

  • ఈనెల 11న జనగామ జిల్లాకు సీఎం కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్​ వరుస ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్నారు. కలెక్టరేట్లతో పాటు తెరాస జిల్లా కార్యాలయాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో అత్యాధునికంగా నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఈ నెల 15న సీఎం ప్రారంభించే అవకాశం ఉంది.

  • 'ఒకప్పుడు గాంధీని హత్యచేసినవారే ఇప్పుడు నాపై దాడి చేశారు'

అప్పట్లో మహాత్మా గాంధీని చంపినవారే నేడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. తనపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయని.. కానీ అల్లా నన్ను రక్షించాడని పేర్కొన్నారు.

  • హిజాబ్ వివాదం- రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం

ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫామ్ డ్రస్​ కోడ్​ను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు పాటించాలని కర్ణాటక సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వారి యాజమాన్యాలు నిర్ణయించిన డ్రస్ కోడ్​ను తప్పనిసరి పాటించాలని తెలిపింది. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను కళాశాలకు రాకుండా అడ్డగించిన ఘటనలు రాష్ట్రంలో వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

  • కుర్రాళ్లు కుమ్మేశారు..

కుర్రాళ్లు పట్టు వదల్లేదు. దీటైన ప్రత్యర్థి ఎదురైనా తలొగ్గలేదు. ప్రపంచకప్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రోఫీయే లక్ష్యంగా అడుగులేస్తూ.. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థినీ దంచి కొడుతూ ముందంజ వేసిన యువ భారత్‌.. ఫైనల్లోనూ ప్రతాపం చూపింది. తనలాగే అజేయంగా ఫైనల్‌కు దూసుకొచ్చిన ఇంగ్లాండ్‌ను ఓడించి సిసలైన విజేత అనిపించుకుంది. పేలవ ఆరంభం నుంచి పుంజుకుని ఇంగ్లాండ్‌.. పోటీనిచ్చినా మన కుర్రాళ్ల పట్టుదల ముందు నిలవలేకపోయింది. భారత్‌కిది అయిదో అండర్‌-19 ప్రపంచకప్‌. చివరగా యువ జట్టు 2018లో కప్పు గెలిచింది.

  • 'రాధేశ్యామ్' శాటిలైట్ హక్కులు.. ఎంతంటే?

ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా శాటిలైట్​ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.250 కోట్లకు ఈ డీల్ కుదిరినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.