- ఎల్.రమణ రాజీనామా
తెలుగుదేశం పార్టీకి ఎల్.రమణ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పర్యావరణ ఉల్లంఘనలపై కేసు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీలో కేసు నమోదైంది. ముదిరెడ్డిపల్లి నివాసి కోస్గి వెంకటయ్య పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భాజపా పెట్టిన పొగతోనే..
రాష్ట్రంలో అవినీతి, అరాచకం, ప్రజావ్యతిరేక పాలన జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BANDI SANJAY) ఆరోపించారు. సీఎం కేసీఆర్ తీరుతో ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అథ్లెట్లతో మోదీ భేటీ!
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లలో స్ఫూర్తి నింపనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈనెల 13న వారితో వర్చువల్‌గా సమావేశంకానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కొవాగ్జిన్ పనితీరు భేష్'
డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడంలో టీకాల సమర్థతపై ఆందోళన నెలకొన్న వేళ ఐసీఎంఆర్ కీలక అధ్యయనం చేసింది. డెల్టా, బీటా వేరియంట్ల(Delta variant)పై కొవాగ్జిన్(Covaxin) సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దంపతుల ఆత్మహత్య
బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఆ కుటుంబానికి కరోనా మహమ్మారి ఉపాధి(CORONA EFFECT) దొరకకుండా చేసింది. ఓ వైపు పిల్లలు ఆకలితో పస్తులుండటం మరో వైపు పని దొరక్కపోవడంతో ఇక బతకలేం అనుకున్న ఆ దంపతులు బలవన్మరణానికి(COUPLE SUICIDE) పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎత్తిపోతలకు అనుమతులివ్వండి'
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫ్రీ నాసా ట్రిప్!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది తమిళనాడు ప్రభుత్వం. ఉచిత నైపుణ్య శిక్షణ, ఫ్రీ నాసా ట్రిప్ వంటి హామీలతో అడ్మిషన్లు పెరిగేలా చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చివరిసారి ఆడాలనుంది
రానున్న రెండు టీ20 ప్రపంచకప్‌లలో కనీసం ఒక్కసారైనా టీమ్ఇండియా తరఫున ఆడాలని ఉందని అన్నాడు వెటరన్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik). క్రికెటర్‌గా ఆటపై తనకు ఇంకా మక్కువ పోలేదని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'విక్రమార్కుడు' ఎలా ఉందంటే?
తమిళంలో 2018లో విడుదలైన 'జుంగా'(Junga) తెలుగులో 'విక్రమార్కుడు'గా(Sethupathi Vikramarkudu) అనువాదమైంది. విజయ్ సేతుపతి, మడోన్నా సెబాస్టియన్, సెయేషా హీరోహీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (జులై 9) ఆహా ఓటీటీలో విడుదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.