- నారాయణపేటకు కేటీఆర్..
నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. ప్రభుత్వ ఆస్పత్రిలో చిల్లపిల్లల వార్డును ప్రారంభిస్తారు. అనంతరం వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో రహదారికి పచ్చజెండా..
హైదరాబాద్-విశాఖ మార్గానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే భూ సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు అవకాశాలున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త సారథిపై కసరత్తు..
తెలంగాణ తెలుగుదేశం పార్టీ (TTDP)కి నూతన అధ్యక్షుడి ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. తెతెదేపా అధ్యక్షుడి పదవికి ఎల్.రమణ రాజీనామా చేయడం వల్ల ఆ స్థానం ఎవరికి ఇవ్వాలనే విషయంపై యోచనలు చేస్తోంది. రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింలు, నన్నూరి నర్సిరెడ్డి వంటి సీనియర్ నేతల పేర్లపై చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్వగ్రామానికి వీర జవాన్ భౌతికకాయం..
ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్ రెడ్డి (JAWAN JASWANTH REDDY) భౌతికకాయం ఏపీలోని బాపట్లకు చేరుకుంది. ప్రత్యేక వాహనంలో మద్రాస్ రెజిమెంట్ సైనికులు తీసుకొచ్చారు. నేడు కొత్తపాలెంలో జశ్వంత్ రెడ్డి పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త ఉత్తేజం తీసుకువస్తా..
దేశంలో పర్యాటక రంగానికి కొత్త ఉత్తేజం తీసుకువస్తానని.. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిసి.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీనికి కొత్త జవసత్వాలు చేకూర్చే ప్రయత్నం చేస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచీ పెద్దసంఖ్యలో పర్యాటకులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమ్మభాషలో సాంకేతిక పట్టా..
పరాయి భాషలో ప్రావీణ్యమే పెద్ద పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యకు దూరమవుతున్న కోట్లాది ప్రజ్ఞావంతుల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే స్థానిక భాషా మాధ్యమాల్లో వృత్తివిద్యా కోర్సుల అందుబాటు ఊపందుకోవాలి. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యాబోధనను సత్వరం పట్టాలెక్కించాలని ప్రధాని మోదీ తాజాగా పిలుపుచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఊరిస్తున్న నీలి విప్లవం..
దేశంలో మత్స్య రంగంలో(Fisheries Department) అపార అవకాశాలున్నాయి. దాదాపు 3 కోట్ల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం అభివృద్ధికి వివిధ కేంద్ర పథకాలు విస్తృత బాటలు పరుస్తున్నాయి. నేడు (జులై 10) జాతీయ మత్స్య రైతుల దినోత్సవం(National fish farmers day 2021) సందర్భంగా ఈ రంగంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లోయలో పడ్డ ట్రక్కు..
కేరళ మలప్పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కొచ్చి వైపు వెళ్తోన్న ఓ ట్రక్కు.. వట్టాపుర ప్రమాదకర మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టోక్యో చేరిన ఒలింపిక్ జ్యోతి..
టోక్యోలో అత్యయిక స్థితి విధించిన కారణంగా జపాన్ రాజధానిలో శుక్రవారం ఒలింపిక్ జ్యోతి ఆవిష్కరణను నిరాడంబరంగా నిర్వహించారు. జన సంచారం లేని వీధుల గుండా ఒలింపిక్ జ్యోతిని టోక్యో చేర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహేష్‌కి విలన్‌గా ఆ దర్శకుడు..
సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో విలన్ ఖరారయ్యారు. ప్రముఖ దర్శకుడిని చిత్ర బృందం ప్రతినాయక పాత్రకు ఎంపికచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.