ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@ 9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top ten news till now
టాప్​టెన్ న్యూస్@ 9PM
author img

By

Published : May 28, 2021, 8:59 PM IST

3,527 కొత్త కేసులు..

రాష్ట్రంలో.. గడిచిన 24 గంటల వ్యవధిలో 3,527 మంది కరోనా సోకినట్లు (corona positive) నిర్ధారణ అయింది. కొత్తగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,982 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బిర్యానీపై KTRకు ఫిర్యాదు

ఆన్​లైన్​లో బిర్యానీ ఆర్డర్​ చేసిన ఓ వ్యక్తి... తనకొచ్చిన పార్శిల్​లో లెగ్​పీసులు (leg piece) లేవంటూ మంత్రి కేటీఆర్​ను ట్యాగ్​ చేస్తూ ట్వీట్​ చేశాడు. దీనిపై మంత్రి స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రేపే చివరి నివేదిక

ఆనందయ్య ఔషధ పరీక్షలపై రేపు చివరి నివేదిక వస్తుందని ఏపీ ఆయుష్‌ కమిషనర్‌ రాములు వెల్లడించారు. దీనిపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుందన్నారు. కంటి మందుపై ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్​ (CM Jagan) ఆదేశించారని రాములు వివరించారు. ఔషధంపై ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పదేళ్ల పాటు పొడిగింపు

రాష్ట్రంలో బలహీనవర్గాల రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగించారు. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్లను పొడిగించారు. ఏ కేటగిరీలో ఏడు శాతం, బీ కేటగిరీ వారికి పదిశాతం, సీ కేటగిరీలో ఒక శాతం, డీ కేటగిరీలో ఏడు, ఈ కేటగిరీలో నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లు అమలవుతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

లైసెన్సు రద్దు

మంత్రి కేటీఆర్​ (KTR) సూచనతో.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిపై ఆరోగ్య శాఖ కొరడా ఝులిపించింది. కొవిడ్ చికిత్సల లైసెన్సును రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. నల్గొండకు చెందిన వంశీకృష్ణ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మరణించారనే ఫిర్యాదుపై స్పందించిన ఆరోగ్య శాఖ 24 గంటల్లోనే చర్యలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఖైదీని పట్టించింది..!

కర్ణాటక చిక్కబళ్లాపుర్​ జిల్లాలోని చింతామణి సబ్​ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ ఖైదీ.. 30 అడుగుల గోడ దూకి పరారయ్యాడు. నగరంలో దాగి ఉన్న అతని సమాచారాన్ని ఓ శునకం పోలీసులకు తెలిసేలా చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పోలీసులపై కత్తి దాడి..

పోలీసులపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి, కాల్పులకు పాల్పడిన ఘటన ఫ్రాన్స్​లో జరిగింది. భారీగా బలగాలు, స్నిఫ్ఫర్​ డాగ్స్​ సహా ఓ హెలికాప్టర్​ను రంగంలోకి దించి అతడ్ని పట్టుకుని హతమార్చారు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నకిలీకి చెక్!

మార్కెట్లో తమ కంపెనీ పేరుతో వచ్చే నకిలీ రెమ్​డెసివర్ ఔషధాలకు చెక్​ పెట్టే విధంగా ఫార్మా సంస్థ జైడస్​ క్యాడిలా కొత్త రకం ప్యాకింగ్ సాంకేతికతను వాడనున్నట్లు వెల్లడించింది. త్వరలో ఓ స్క్రాచ్​ కోడ్​ను ప్యాకింగ్​పై ముద్రించనున్నట్లు తెలిపింది. ఆ కోడ్​ను ఉపయోగించి వినియోగదారులే సులభంగా అది నకిలీదా, నిజమైందా అనేది తెలుసుకోవచ్చని వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'అతడే ఎక్కువ'

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ప్రధాన కోచ్ రవిశాస్త్రి.. జట్టుపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడని, స్ఫూర్తి నింపుతున్నాడని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెస్టుల్లో భారత జట్టు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఓటీటీలో 'రంగ్​దే!'

ప్రేమకథా చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్​లో నితిన్​, కీర్తి సురేశ్​ జంటగా నటించిన చిత్రం 'రంగ్​దే'. రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.