పిల్లలను చెరువులో తోసేసిన తల్లి
సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను కర్కశంగా చెరువులోకి తోసేసింది. ఘటనలో కుమారుడి మృతదేహం లభ్యం కాగా... కుమార్తె కోసం గాలిస్తున్నారు. అసలు కారణమేంటి?
50 వేల మందికి కరోనా పరీక్షలు..
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వారం, పది రోజుల్లో.. 5 జిల్లాల పరిధిలో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని.. సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరిన్ని వివరాలు...
గవర్నర్ దృశ్య మాధ్యమ సమీక్ష
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృశ్య మాధ్యమ సమావేశం జరపనున్నారు. కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య నిపుణులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. వేటిపై చర్చించనున్నారంటే..?
జేసీ కుటుంబానికి లోకేశ్ పరామర్శ
జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించనున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ నుంచి అనంతపురానికి బయలుదేరారు.
ఆస్పత్రి వార్డులోకి వర్షపు నీరు
మహారాష్ట్ర జల్గావ్లోని డాక్టర్ ఉల్హాస్ పాటిల్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు వర్షపునీటితో నిండిపోయింది. నీరు మోకాళ్ల లోతుకు చేరింది. ఆ సమయంలో రోగులను ఏం చేశారంటే?
అంతరిక్ష పోటీలో వారి సామర్థ్యం ఎంత?
టెలికమ్యూనికేషన్ రంగంలో 'జియో, భారతీ ఎయిర్‌టెల్' వంటి ప్రైవేటు సంస్థల ప్రవేశం ప్రజలకు ఎంత సౌలభ్యం, సౌకర్యం కల్పించిందో చూశాం. అంతరిక్ష రంగంలోనూ ఈ సంస్థలు ప్రవేశిస్తే అదే స్థాయి ప్రయోజనాలు సిద్ధిస్తాయని ఆశించవచ్చా?
ప్రపంచంలో కరోనా విజృంభణ
కరోనా బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారంటే..?
పెట్రో ధరల పెంపు
పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వరుసగా తొమ్మిదో రోజూ పెంచాయి. తాజాగా వాటిపై ఎంత పెంచారంటే...?
'అంతలా కష్టపడ్డాడు'
సుశాంత్‌కు ధోనీ పాత్రపై ఉన్న ఆసక్తి గురించి చెప్పిన నిర్మాత అరుణ్ పాండే.. 'ఎం.ఎస్.ధోని' బయోపిక్‌లోని హెలికాప్టర్ షాట్ కోసం అతడు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ షాట్‌కోసం సుశాంత్ ఏమి చేశాడంటే?
మరోసారి అలాంటి కథలో అనుష్క?
హీరోయిన్ అనుష్క.. మరోసారి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంలో నటించనుందని సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఎవరుంటారంటే...?