మరో 10 రోజులు లాక్డౌన్
రాష్ట్రంలో లాక్ డౌన్‌ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
కొత్తగా 1,897 కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,33,134 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 15 మంది మరణించారు పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'రాజకీయంగా బుద్ధిచెబుతాం'
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు బుద్ధిచెబుతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala) అన్నారు. ప్రజల మద్దతుతో హుజూరాబాద్(Huzurabad) ఎన్నికలో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆత్మగౌరవ బావుటా ఎగరవేస్తానని తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
కన్నతల్లి కర్కషత్వం.!
ప్రాణం పోసిన అమ్మే ఆ పిల్లాడి పాలిట యుమడయ్యింది. భర్త మీది కోపమే కొడుకుకు తల్లి విసిరిన యమపాశమైంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనో... కుమారుని వంకతో భర్త పదేపదే తన ఇంటికి వస్తున్నాడనో.. తన కోపాన్నంతా చిన్నారిపై చూపించింది. లాలించి గోరు ముద్దలు పెట్టిన చేతులతో... ఉక్రోషంతో ఇష్టమొచ్చినట్టు కొట్టింది. జీవం పోసిన అమ్మే.. జీవశ్చవమయ్యేలా కొడుతుంటే.. ఆ పిల్లాడు తట్టుకోలేక శ్వాస విడిచాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
44కోట్ల టీకాలకు ఆర్డర్.!
కేంద్రం 44 కోట్ల కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా డోసులు కొనుగోలు చేసింది. 25 కోట్ల కొవిషీల్డ్, 19 కోట్ల కొవాగ్జిన్ డోసులకు ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే కొనుగోలుకు అయ్యే మొత్తంలో 30 శాతాన్ని సంబంధింత సంస్థలకు చెల్లించినట్లు స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
63 రోజుల తర్వాత.!
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 86,498 మందికి కొవిడ్(covid-19 India) సోకింది. 66 రోజుల కనిష్ఠానికి కేసులు నమోవటం ఇదే తొలిసారి. వైరస్ బారినపడి మరో 2123 మంది మరణించారు. 63 రోజుల తర్వాత కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
10 నిమిషాల్లోనే రిజల్ట్!
కరోనా టెస్ట్‌కు కొత్త కిట్‌ను అభివృద్ధి చేసింది కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయం. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రవేటు సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన ఈ కిట్.. 90శాతం కచ్చితత్వంతో పని చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కిట్ కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఫలితాన్నిస్తుందని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
పెరిగిన బంగారం
పసిడి, వెండి ధరలు పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.150 పెరిగింది. వెండి కిలో ధర రూ.70వేల మార్కును చేరుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'కోహ్లీ విఫలమైన ప్రతిసారీ అతనే'
టీమ్ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానెపై అనవసర ఒత్తిడి పెంచొద్దని సూచించారు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. అతడొక మంచి ఆటగాడని కితాబిచ్చారు. తనను తాను ఎప్పుడో నిరూపించుకున్నాడని విదేశాల్లో అతడి రికార్డులు బాగున్నాయని చెప్పుకొచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'పవన్ చిత్రంపై క్లారిటీ'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌పై ఓ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">