ETV Bharat / city

టాప్‌ టెన్ న్యూస్ @ 9 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top ten news till 9 PM
టాప్‌ టెన్ న్యూస్ @ 9 PM
author img

By

Published : Jun 1, 2021, 8:58 PM IST

కొత్తగా 2,493 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 94,189 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 2,493 కరోనా కేసులు నమోదయ్యాయి. 15 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. కరోనా నుంచి కోలుకున్న మరో 3,308 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 33,254 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం

ధర్మాసనం ఆదేశాల అమలులో జాప్యమెందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు అన్నీ భవిష్యత్తులోనే చేస్తారా.. ముందస్తు చర్యలు తీసుకోరా అని ప్రశ్నించింది. కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన ధర్మాసనం....ప్రభుత్వంపై ప్రశ్నలవర్షం కురిపించగా.... అధికారులు ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ప్రేయసి కోసం వెళ్లి.. నాలుగేళ్ల తర్వాత ..!

ప్రేయసి కోసం పాక్‌కు వెళ్లి అక్కడి చెరసాలలో శిక్ష అనుభవించిన ప్రశాంత్‌ కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత కుటుంబం చెంతకు చేరారు. శిక్ష పూర్తయినందున పాక్‌ అధికారులు భారత్‌కు అప్పగించగా... సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చొరవతో దిల్లీ నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

భూముల సమగ్ర సర్వే

భూముల సమగ్ర సర్వే దిశగా సర్కారు కసరత్తు ప్రారంభించింది. భూముల డిజిటల్ సర్వే చేసే కంపెనీల ప్రతినిధులతో సీఎస్​ సమావేశమయ్యారు. సర్వే చేపట్టేందుకు ఈ ఏడాది బడ్జెట్​లో 400 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని సోమేశ్ కుమార్ తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

దేశంలో కరోనా తగ్గుముఖం

దేశంలో కరోనా కేసులు(corona cases in india) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,27,510 మందికి కొవిడ్ సోకింది. వైరస్​ బారిన పడి మరో 2,795 మంది మరణించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు

కరోనా ఉధృతి కారణంగా వాయిదా పడిన సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'వారి కోసం కేంద్రం ఏం చేస్తోంది?'

కొవిడ్​ వల్ల అనాథలుగా మారిన పిల్లల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని అదేశించింది సుప్రీంకోర్టు. తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను కూడా ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఈసారి జీడీపీ వృద్ధి 9.3%!

భారత జీడీపీ వృద్ధి(GDP Growth) 2021-22 ఆర్థిక సంవత్సరానికి 9.3 శాతంగా నమోదవుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.9శాతంగా ఉంటుందని పేర్కొంది. లాక్‌డౌన్ నిబంధనలు దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపడంలేదని అభిప్రాయపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'రోహిత్​ .. నా బ్యాట్​తోనే'

రోహిత్​ శర్మ తొలి హాఫ్ సెంచరీని.. తన బ్యాట్​తోనే సాధించాడని పేర్కొన్నాడు టీమ్ఇండియా వికెట్​ కీపర్ దినేష్ కార్తీక్. అయితే ఈ ఘనత బ్యాట్​ది మాత్రం కాదని ఆడిన బ్యాట్స్​మన్​కే దక్కుతుందని స్పష్టం చేశాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

పూజాహెగ్డే ఉదారత.. !

కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తన వంతు సాయం చేశారు స్టార్​ హీరోయిన్​ పూజాహెగ్డే. 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించి.. తన ఉదారత చాటుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.