ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM - top ten news till now 9 pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till 9 pm
టాప్​టెన్​ న్యూస్​ @ 9PM
author img

By

Published : May 12, 2021, 9:00 PM IST

'ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగు'

కొవిడ్​పై ఏర్పాటైన రాష్ట్రస్థాయి టాస్క్​ఫోర్స్ కమిటీ మొదటిసారి సమావేశమైంది. పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన టాస్క్​ఫోర్స్ కమిటీ... రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులతో పాటు, వైరస్​ను ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించింది. కొవిడ్ చికిత్సకు అవసరమయ్యే ఔషధాలు, వైద్యసామగ్రి, నిల్వలు, అవసరాలపై టాస్క్​ఫోర్స్ సమీక్షించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తగ్గుముఖం పడుతోంది

తెలంగాణకు టీకా, ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు కోరారు. రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ నిర్వహించిన సమీక్షలో కేసీఆర్​ ఆదేశాలతో హరీశ్​ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటింటి ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నామని హరీశ్​ రావు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాష్ట్రంలో 4723 కొత్త కేసులు.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో 69 వేల 525 మందికి పరీక్షలు చేయగా... 4723 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మహమ్మారి బారిన పడి 31 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పటిష్ఠంగా అమలు

క్షేత్ర స్థాయిలో లాక్​డౌన్​ పటిష్ఠంగా అమలయ్యేలా పోలీసులు పనిచేస్తున్నారని డీజీపీ మహేందర్​ రెడ్డి అన్నారు. లాక్​డౌన్ అమలుపై ఇప్పటికే సీపీలు, జిల్లా ఎస్పీలకు దిశానిర్దేశం చేసినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఏటీఎం కేసు ఛేదించారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఏటీఎం వద్ద ఏప్రిల్‌ 29న జరిగిన నగదు దోపిడీ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో.. ఏటీఎం సెక్యూరిటీ గార్డు మృతి చెందగా… మరొకరు గాయపడ్డారు. చోరీకి పాల్పడినవారు బిహార్‌కు చెందిన అజిత్‌కుమార్‌, ముఖేశ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరణాల్లో రికార్డ్​

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మరణాాలు గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్​స్థాయిలో నమోదయ్యాయి. 24గంటల్లో 4,205 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉత్పత్తి రెట్టింపు

భారత్​ బయోటెక్​ తయారు చేస్తున్న కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి.. మే-జూన్‌ నాటికి రెట్టింపు కానుందని కేంద్ర కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది. జులై-ఆగస్టు నాటికి ఉత్పత్తి ఆరేడింతలు పెరుగుతుందని చెప్పింది. సెప్టెంబరు నాటికి నెలకు 10కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకుంటుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పనివేళల్లో మార్పులు

రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు రేపటి నుంచి 20వ తేదీ వరకు నాలుగు గంటలే పని చేయనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి తమ బ్యాంకు పనులు చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆశలు గల్లంతు!

కరోనా నేపథ్యంలో సింగ్​పూర్​ ఓపెన్​-2021ను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) ప్రకటించింది. దీంతో ఒలింపిక్స్​ అర్హత కోసం పోటీపడుతున్న భారత షట్లర్లు సైనా, శ్రీకాంత్​కు ఉన్న ఒక్క అవకాశం చేజారిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆ పాటకు 35 మిలియన్లు..

కొత్త చిత్రాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆచార్య లాహే లాహే, విజయ్ సేతుపతి ట్రైలర్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.