ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM

author img

By

Published : May 9, 2021, 8:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till  9 pm
టాప్​టెన్​ న్యూస్​ @ 9PM

1. ముగిసిన సీఎం సమీక్ష

రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. కొవిడ్‌ వ్యాప్తి చేసే అవకాశమున్నవారికి ముందుగా టీకా.. కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ సహా... వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై సమావేశంలో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ముగ్గురు మృతి

హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందారు. ఆక్సిజన్ అందక 20మంది సుమారు గంటసేపు ఇబ్బంది ఎదుర్కొన్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ఫిల్లింగ్ ట్యాంక్‌లో ఆక్సిజన్ అయిపోవడంతో.. మరో ట్యాంక్ రావటానికి ఆలస్యం కావడం వల్ల సమస్య తలెత్తింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఐదువేల లోపే..

రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య సైతం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో కొత్త కేసుల కంటే.. వైరస్‌ను జయించిన వారి సంఖ్య సంఖ్య అధికంగా ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 5 వేలకు దిగువకు కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. నాలుగో రోజూ అదేస్థాయి.!

దేశంలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజూ 4లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. వైరస్​ సోకినవారిలో మరో 4,092 మంది చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సీఎంలకు మోదీ ఫోన్​

పంజాబ్, కర్ణాటక, బిహార్, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈమేరకు ఫోన్లో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. గ్రామీణ భారతానికి నిధులు

కరోనా రెండో దశను నియంత్రించేందుకు గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. 25 రాష్ట్రాలకు రూ. 8,923కోట్ల గ్రాంట్లను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అసోం పీఠంపై హిమంత

అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ సోమవారం మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు కేబినెట్​ మంత్రులు కూడా రేపే ప్రమాణస్వీకారం చేస్తారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్​కు హిమంత కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. వాటికే టీకాలు

మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ సహా 10 రాష్ట్రాల్లోనే భారీగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. శనివారం నమోదైన కేసుల్లో 71.75 శాతం.. ఈ రాష్ట్రాల్లోనే వెలుగు చూసినట్లు పేర్కొంది. మరోవైపు... రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలకు మరో 46 లక్షల టీకా డోసులు అందజేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. రిలయన్స్ దూకుడు

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ ఈ ఏడాదికిగానూ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండో రిటైల్ సంస్థగా నిలిచింది. దీనితోపాటు గ్లోబల్​ పవర్ ​ఆఫ్​ రిటైలింగ్​లో ఈ సంస్థ ర్యాంక్ 56 నుంచి 53కు మెరుగైంది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన వాల్​మార్ట్​ అగ్రస్థానంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కోహ్లీనే కారణం

విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు టీమ్​ఇండియా బౌలర్లకు ఎలాంటి పిచ్​ను సిద్ధం చేయాలో తెలియక ప్రత్యర్థి జట్లు తికమక పడతాయని చెప్పాడు ఫాస్ట్​ బౌలర్​ మహ్మద్​ షమీ. భారత జట్టు పేస్‌ బౌలింగ్‌ బలంగా మారడానికి కోహ్లీ సారథ్యం ఓ కారణమని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.