పోలీసులు నన్ను కొట్టారు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. హైకోర్టు సూచన మేరకు ఆయనను గుంటూరులోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్టును జడ్జికి అందజేశారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'వారి నిర్లక్ష్యం వల్లే మృతి'
నిండుచూలాలు మృతికి ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యమే కారణమని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. ఐదు ఆస్పత్రులు తిరిగినా... ఒక్క వైద్యుడైనా కనీసం నాడిపట్టి కూడా చూడలేదని విచారణలో వివరించారు. జిల్లా వైద్యాధికారులతో పాటు రెవెన్యూ అధికారులతో వేరువేరుగా జరిపిన విచారణలో... ఇంఛార్జ్ కలెక్టర్ శ్వేతామహంతికి ఇదే విషయాన్ని నివేదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాజధాని చెరువుల్లో కరోనా .!
కొవిడ్ రెండో ఉద్ధృతి రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే మొదలైందంటున్నారు పరిశోధకులు. నగరంలోని హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు చెరువుల్లోని నీటి నమూనాలను సేకరించి పరిశోధనలు చేశారు. మార్చిలో పెరుగుదల కన్పించి ఏప్రిల్ నుంచి గరిష్ఠ స్థాయిలో కొనసాగుతోందని పేర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బ్లాక్ ఫంగస్‌పై అప్రమత్తం.!
రాష్ట్రంలో క్రమంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్స కోసం కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' బ్లాక్ ఫంగస్‌కు కారణమదే'
స్టిరాయిడ్లను అతిగా వినియోగించటమే బ్లాక్ ఫంగస్ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కొవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో.. ఆస్పత్రులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. పలు రాష్ట్రాల్లో 500కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తౌక్టే ఉగ్రరూపం
మరో 6గంటల్లో తౌక్టే తుఫాను తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 18న గుజరాత్‌లోని పోర్‌బందర్-నలియా మధ్య తీరం దాటనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
85 శాతం ఆ రాష్ట్రాల్లోనే.!
దేశంలో నమోదైన కరోనా కేసుల్లో కేవలం 10 రాష్ట్రాల్లోనే 85 శాతం కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 11 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. అయితే.. గత ఐదు రోజుల్లో నాలుగోసారి కొత్తగా నమోదైన కరోనా కేసుల కన్నా రికవరీలే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'షాపింగ్ యాప్‌లో వీడియో స్ట్రీమింగ్'
షాపింగ్ యాప్‌లో వీడియో స్ట్రీమింగ్ చేసేలా సరికొత్త సర్వీస్‌తో ముందుకొచ్చింది అమెజాన్ సంస్థ. మినీ టీవీని శనివారం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బీసీసీఐపై విమర్శలు
టీమ్ఇండియా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి విషయంలో బీసీసీఐ సరిగా వ్యవహరించలేదని ఆసీస్ క్రికెటర్ స్టాలేకర్ విమర్శించింది. ఇంగ్లాండ్ పర్యటన విషయంలో కనీసం ఆమెతో మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
డ్యాన్సర్లకు శేఖర్ మాస్టర్
హైదరాబాద్‌లో ఉన్న పలువురు డ్యాన్సర్లు, కరోనా వల్ల పనిదొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు తనను సంప్రదిస్తే తగిన ఏర్పాటు చేస్తానని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అన్నారు. ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.