ఏపీ ఎంపీ అరెస్టు
ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు... హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు... ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఏపీ సీఐడీ పోలీసులను సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'2 కోట్ల మంది జయించారు'
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2 కోట్లు దాటింది. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు కొత్తగా నమోదైన కేసుల సంఖ్య కన్నా రికవరీలే ఎక్కువగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో టీకా తీసుకున్న వారి సంఖ్య 18 కోట్లకు చేరువైనట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8 వేల మంది మిస్సింగ్!
బెంగళూరులో 8 వేల మందికి పైగా కరోనా బాధితుల జాడ తెలియటం లేదని బెంగళూరు మహానగర పాలక సంస్థ, రాష్ట్ర వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది బాధితులు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. స్థానిక పోలీస్ అధికారుల ద్వారా బాధితులను గుర్తిస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎవరైనా చికిత్స పొందొచ్చు
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారిని అడ్డుకోవడంలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి కరోనా చికిత్స కోసం వచ్చే వారు ముందుగానే... ఆస్పత్రిలో పడకను రిజర్వు చేసుకోవాలని అన్నారు. పడకలు రిజర్వు చేసుకోకుండా రాష్ట్రానికి వచ్చి ఇబ్బందులు పడొద్దని.. విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జంట నగరాలను ముంచెత్తింది.!
ఎండ తీవ్రత వల్ల ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న భాగ్యనగర వాసులు ఉపశమనం పొందారు. ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం.. సాయంత్రానికి కురిసిన జోరువానతో చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'భారత్ - రష్యాలకు చారిత్రాత్మక రోజు'
భారత్‌లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో వినియోగంలోకి వచ్చిన మొదటి ఫారిన్ వ్యాక్సిన్‌గా స్పుత్నిక్- వి చరిత్ర సృష్టించిందని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రివ్ తెలిపారు. ఇదే క్రమంలో స్పుత్నిక్ లైట్‌ను త్వరలో భారత్‌లో ఆవిష్కరిస్తామని దిమిత్రివ్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వాటిపై ధరలు తగ్గించండి.!
వైద్య సంబంధమైన ముడిసరకులపై పెంచిన ధరలను తగ్గించాలని చైనాకు భారత్ విజ్ఞప్తి చేసింది. నిలిపేసిన కార్గో విమానాలను పునరుద్ధరించాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'బ్లూ టిక్' కావాలా? అయితే ఇలా చేయండి.!
ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ తన ఖాతాల ధ్రువీకరణ (బ్లూటిక్) కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. తమ ఖాతాకు బ్లూ టిక్ కావాలనుకునే వినియోగదారులు అకౌంట్ సెట్టింగ్‌లోని ఫారంలో వివరాలు నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరిలోనే ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ.. వివిధ కారణాల వల్ల ఆలస్యమైనట్లు టెక్ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఒలింపిక్స్ రద్దుకై పిటిషన్
టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయాలనే వ్యాజ్యాన్ని 3.5 లక్షల సంతకాలతో టోక్యో ప్రభుత్వానికి సమర్పించారు ఆందోళనకారులు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో విశ్వ క్రీడలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'జబర్దస్త్ క్రికెట్.!'
ఈరోజు రాత్రి ప్రసారం కానున్న 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమో ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్ స్కిట్లో క్రికెట్‌తో హంగామా చేశారు. అలానే మను జబర్దస్త్ గొప్పతనం గురించి మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.