మరో 4,693 కరోనా కేసులు
రాష్ట్రంలో మరో 4,693 కరోనా కేసులు, 33 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న మరో 6,876 మంది బాధితులు కోలుకున్నారు. ఐసోలేషన్‌లో 56,917 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మే 31 వరకూ వారికే .!
రాష్ట్రంలో మే 31 వరకూ సెకండ్ డోస్ వారికే వ్యాక్సిన్ ఇస్తామని ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఆక్సిజన్‌ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఇప్పట్లో ఉండవు'
కరోనా ఉద్ధృతి తగ్గేవరకు ఎలాంటి ఎన్నికలు ఉండబోవని సీఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో వచ్చె నెల 3తో ముగియనున్న శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన మండలి సభ్యుల భర్తీ కోసం ప్రభుత్వం లేఖ రాయగా... ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ కష్టమని వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'వ్యాక్సిన్ కోసం ఉరి వేసుకోవాలా?'
వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి సదానంద గౌడ వివాదాస్పదంగా మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతే అధికారులు ఉరివేసుకోలేరు కదా! అని అన్నారు. అందరికీ సకాలంలో వ్యాక్సిన్ అందేలా చూడాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఈమేరకు స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ తర్వాతే రెండో డోసు
కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచొచ్చన్న నిపుణుల కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో టీకా కొవాగ్జిన్ డోసుల మధ్య అంతరంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచటం ఇది రెండోసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'వారికి రేషన్ ఇవ్వండి'
లాక్డౌన్ కారణంగా నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికుల కోసం ముఖ్యమైన ప్రాంతాల్లో సామాజిక వంటశాలలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు రవాణా సౌకర్యాలను కల్పించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గవర్నర్‌కు నిరసన సెగ
బంగాల్ శాసనసభ ఎన్నికల పోలింగ్, ఫలితాల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్‌కు నిరసన సెగ తగిలింది. కొందరు నల్ల జెండాలు ఊపుతూ ఆయన పర్యటనపై వ్యతిరేకత తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
లాక్‌డౌన్‌లోనూ బంగారం కొనండిలా...
సాధారణంగా అక్షయ తృతీయ వచ్చిందంటే చాలా మంది పసిడి కొనుగోళ్లకు ఎగబడతారు. అయితే కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఈసారి నేరుగా దుకాణాల్లో బంగారం కొనడం కష్టం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ పర్వ దినాన బంగారం కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశాలేమిటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పొవార్ మరోసారి.!
భారత మహిళా క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా టీమ్ఇండియా మజీ క్రికెటర్ రమేశ్ పొవార్, మరోసారి నియమితుడయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రిలీజ్‌కు ఐదు సినిమాలు..!
కొత్త చిత్రాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఐదు సినిమాలు, 'వకీల్‌సాబ్'లోని 'మగువా మగువా' గీతానికి సంబంధించిన సంగతులు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.