1. వరుసగా రెండోరోజు.!
రాష్ట్రంలో మరో 4,826 కరోనా కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 7,754 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 65,757 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'మీలో మీరు బాధపడకండి '
రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో మానసిక సామాజిక సలహా సేవలను రాచకొండ పోలీసులు ప్రారంభించారు. కరోనా కారణంగా ఒంటరితనం, ఒత్తిడి, నిరాశ, భయాలు, దుఃఖం, ఆందోళనతో బాధపడుతున్న వారు తమ నంబర్లను సంప్రదించాలని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా సైకో సోషల్ కౌన్సిలింగ్ సేవలపై పోస్టర్లను విడుదల చేసి సేవలను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అది నిజం కాదు.!
ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలున్నాయని డీఎంఈ రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ కింగ్ కోఠీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన... ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోయారనడంలో నిజం లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఎట్టకేలకు అనుమతించారు.!
ఏపీకి చెందిన కొవిడ్ రోగి అంబులెన్స్‌ను పోలీసులు నిలిపేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్దే రాష్ట్ర పోలీసులు అంబులెన్స్‌ను నిలిపేశారు. అనంతరం ఉన్నతాధికారులతో చర్చించిన పోలీసులు చివరికి అనుమతించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5 . మరో పెళ్లి రద్దు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ పెళ్లి వింత కారణంతో రద్దయింది. వరడు రెండో ఎక్కం చెప్పలేదని వధువు వివాహానికి నిరాకరించింది. రెండు కుటుంబాలు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేం లేక పెళ్లికొడుకు కుటుంబం పెళ్లికూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఓడిన ప్రధాని..!
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. ప్రతినిధుల సభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఓలీకి 93 ఓట్లు వచ్చాయి. సీపీఎన్ మావోయిస్ట్ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ మద్దతు ఉపసంహరించుకోగా మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో ఈ బలపరీక్ష జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. విక్రయాలు ఢమాల్!
కరోనా సంక్షోభంతో వాహన విక్రయాలు భారీగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రిజిస్ట్రేషన్లు 29.85శాతం తగ్గాయని తెలిపింది. ఇది గత ఎనిమిదేళ్లలో ఇదే కనిష్ఠమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ధరలు తగ్గేది అప్పుడే
క్లియరెన్స్ సమస్యల కారణంగా ఓడరేవుల్లో నిలిచిపోయిన వంటనూనెలు దిగుమతి అయితే.. దేశంలో నూనెల ధరలు అదుపులోకి వస్తాయయని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. బాబర్ మరో రికార్డు
జింబాబ్వేపై రెండో టెస్టులో గెలిచిన పాకిస్థాన్.. టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు పాక్ సారథి బాబర్ అజామ్. ఇంతకీ అదేంటంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఓటీటీ రిలీజ్‌కు రెడీ..
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ధనుష్ 'కర్ణన్', సల్మాన్‌ఖాన్ 'రాధే', ఎమ్మెస్ కొత్త చిత్రం సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.