ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 7PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till 7 pm
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
author img

By

Published : May 9, 2021, 6:59 PM IST

1. ఆగిన ఊపిరి

హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి చెందారు. దాదాపు 2 గంటలుగా 20 మంది రోగులు ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్‌ సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం చూపారని బాధితుల ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఐదువేల లోపే

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 55,358 నమూనాలను పరీక్షించగా 4976 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,97,361కి చేరింది. కరోనా మహమ్మారితో తాజాగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 2,739కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. విచారణ ముమ్మరం

వామనరావు దంపుతుల హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. రామగుండం కమిషనరేట్​లో నిన్నంతా... పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధును ప్రశ్నించిన పోలీసులు... ఈరోజు ఆయన సతీమణితో పాటు పూదరి సత్యనారాయణను కూడా విచారిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అవీ పాటిస్తే ముప్పు తక్కువే

దేశంలో ఓ వైపు కరోనా రెండో దశ విజృంభిస్తోన్న తరుణంలో.. మూడో దశ అనివార్యమనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే తగిన నిబంధనలు పాటిస్తూ.. ఎక్కువ మంది జనాభాకు టీకాలు వేస్తే భవిష్యత్​లో వచ్చే కరోనా తీవ్రత తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. పోలీసుల 'ఫ్లాష్​మాబ్​'

చెన్నైలోని ఎంజీఆర్​ సెంట్రల్​ రైల్వే స్టేషన్​లో కరోనాపై అవగాహన కల్పించడానికి పోలీసులు.. ఫ్లాష్​మాబ్​ నిర్వహించారు. వైరస్​ బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు. అలాగే అర్హులైనవారు టీకా తీసుకోవడం, సరిగ్గా మాస్క్​ ధరించడం, భౌతిక దూరం పాటించడం సహా సబ్బుతో తరచు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తల గురించి ప్రదర్శన చేస్తూ వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కుట్ర భగ్నం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రకుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి ఉగ్రస్థావరం నుంచి 19 గ్రెనేడ్​లు స్వాధీనం చేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. గూగుల్​ ప్రత్యేక ​ సాంగ్​

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరు టీకా తీసుకోవటం చాలా ముఖ్యం. ప్రజలు వ్యాక్సిన్​ తీసుకునేలా అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేసింది గూగుల్​. ఇందుకోసం ఓ పాటను తీసుకొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆ సేల్ లేనట్లే?

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 'అమెజాన్ ప్రైమ్ డే సేల్​'ను తాత్కాలికంగా వాయిదా వేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆఫర్​ తిరిగి జులైలో మొదలవనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'అతనికింకా టైముంది

జాతీయ జట్టు(టెస్టు ఫార్మాట్​)లోకి యువ బ్యాట్స్​మన్ దేవదత్​ పడిక్కల్​ను తీసుకునేందుకు మరో ఏడాది పట్టొచ్చని మాజీ చీఫ్​ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు​. ఫామ్​లో ఉన్న అతడిని ప్రపంచటెస్టు ఛాంపియన్​షిఫ్​ ఫైనల్​, ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం ఎందుకు తీసుకోలేదంటూ అభిమానులు అడుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు ఎమ్మెస్కే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అధ్యక్షుడిగా అనిల్ కుమార్

తెలుగు ఫిల్మ్ వర్కర్స్​ ఫెడరేషన్​ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్​ కుమార్ ఎన్నికయ్యారు. కరోనా ప్రభావంతో ఇబ్బందిపడుతున్న సినీ కార్మికుల బాగుకే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.