1.ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిపై...
దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు. కేవలం పది నిమిషాలు మాత్రమే సాగిన ఈ సమావేశంలో... రాష్ట్రంలో ఆరు డొమెస్టిక్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలని హరిదీప్ పురిని సీఎం కేసీఆర్ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.ఉలిక్కిపడిన బొల్లారం...
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడ ఉలిక్కిపడింది. వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుడు బీభత్సం సృష్టించింది. పరిశ్రమలో మంటలు చెలరేగగా.. కార్మికులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. 8 మంది కార్మికులకు గాయలవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.కసరత్తు పూర్తి...
టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముగిసింది. నాలుగు రోజులుగా సాగిన నేతల అభిప్రాయ సేకరణ శనివారం మధ్యాహ్నం పూర్తయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.రైతుల కోసమే...
కొత్త సాగు చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకుంటారని ప్రధాని మోదీ చెప్పారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. కొత్త చట్టాల్లో పేర్కొన్నట్లుగా రైతులు తమ పంట ఉత్పత్తుల్ని వారి అభీష్టం మేరకు మండీల్లో లేదా బయట.. ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.14న సింఘ్ సరిహద్దులో...
డిసెంబర్ 14న రైతు సంఘాల నాయకులు సింఘు సరిహద్దులో నిరాహార దీక్షకు కూర్చుంటారని 'సంయుక్త కిసాన్ ఆందోళన్' నాయకుడు కమల్ ప్రీత్ సింగ్ పన్ను తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని, సవరణలకు తాము అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6.ఐపీఎస్‌లకు సమన్లు...
బంగాల్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సమన్లు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేసిన వీరిని డిప్యుటేషేన్పై కేంద్రంలో సేవలందించాలని తెలిపింది. గురువారం బంగాల్లో.. నడ్డా కాన్వాయ్‌పై దాడి జరగడానికి భద్రతా పరమైన లోపాలే కారణమని కేంద్రం భావించి, ముగ్గురు ఐపీఎస్‌లకు ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7.బంగారం ఎలా పోయింది...?
అక్రమార్కులకు వణుకు పుట్టించే కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. తమిళనాడులో సీబీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం అదృశ్యమైందన్న ఆరోపణల నేపథ్యంలో మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఘటనపై నిజానిజాలు తేల్చే బాధ్యత తమిళనాడు పోలీసులకు అప్పగించటం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.24 గంటల్లోనే ఇస్తాం...
24 గంటల్లోపు కరోనా మొదటి టీకా డోసును ప్రజలకు ఇవ్వడం ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ఎవరికి మొదటి డోసు ఇవ్వాల్లో గవర్నర్లు నిర్ణయిస్తారని చెప్పారు. వృద్ధులు, వైద్య సిబ్బందికి మొదట టీకా అందించనున్నట్లు తెలిపారు. మరోవైపు, టీకాపై విశ్వాసం ఉంచాలని అమెరికన్లను కోరారు జో బైడెన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9.ప్రాక్టీస్‌లోనూ భారత్ సత్తా...
ఆస్ట్రేలియా-ఎతో జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా సత్తాచాటుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ ముందు 472 పరుగుల ఆధిక్యం ఉంచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10.కొత్త సరుకు...
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'మైదాన్' రిలీజ్ డేట్, 'కోతి కొమ్మచ్చి' షూటింగ్ పూర్తి, 'రెడ్' సినిమా పాట ప్రోమోతో పాటు పలు చిత్రాల కబుర్లు ఉన్నాయి. అవేంటో చూసేయండి మరి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.