ETV Bharat / city

Telangana Top News: టాప్​ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Jun 28, 2022, 6:59 PM IST

  • హైదరాబాద్​ సిగలో మరో మణిహారం.

విశ్వనగర సిగలో మరో కలికితురాయి.. టీ-హబ్​ 2.0 కొలువుదీరింది. భాగ్యనగర ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన టీహబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నగరంలోని రాయదుర్గంలో నిర్మించిన రెండోదశ భవనాన్ని సీఎం పరిశీలించారు.

  • హైదరాబాద్​లో రాత్రి భారీవర్ష సూచన.. బయటకు రావొద్దని హెచ్చరిక

హైదరాబాద్​లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. వాన తీవ్రతకు పలు ప్రాంతాల్లో విద్యుత్​కు అంతరాయం ఏర్పడగా.. రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

  • ఈ నెల 30న పదో తరగతి ఫలితాలు..

రాష్ట్రంలో ఫలితాల పండుగ నడుస్తోంది. ఈరోజు.. ఇంటర్​ విద్యార్థుల ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వం.. పదో తరగతి ఫలితాలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 30న ఫలితాలు వెల్లడించేందుకు నిశ్చయించింది.

  • హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్​కు చుక్కెదురు..

మంత్రి కొప్పుల ఈశ్వర్​కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్​ను తిరస్కరించాలని అభ్యర్థించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. త్వరలోనే పిటిషన్​పై విచారణ చేపట్టనుంది.

  • బీఎస్పీ నేతను ఇంటికి చేర్చిన పోలీసులు..

3 రోజుల క్రితం ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంటినుంచి వెళ్లిపోయిన వికారాబాద్​ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సత్యమూర్తిని పోలీసులు సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి.. పెన్​డ్రైవ్​, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. సత్యమూర్తి భార్య అదృశ్యం కేసును కూడా త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.

  • తల నరికి యువకుడి హత్య..

రాజస్థాన్ ఉదయ్​పుర్​లో అత్యంత కిరాతక హత్య జరిగింది. ఓ యువకుడ్నిహత్య చేసి తల, మొండెం వేరు చేశారు. మృతుడు కొద్ది రోజుల క్రితం నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియో వీడియో పోస్టు పెట్టాడు. హత్య తమపనేనని ఇద్దరు వ్యక్తులు వీడియో విడుదల చేశారు.

  • కూలిన నాలుగు అంతస్తుల భవనం.. 17 మంది మృతి

ముంబయిలో సోమవారం రాత్రి కుర్లాలోని ఓ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న 12మందిని ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • అంబానీ సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో పగ్గాలను తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. ఇకపై ఆకాశ్ అంబానీ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్​కు ఛైర్మన్​గా వ్యవహరించనున్నారు.

  • అదరగొట్టిన రాధా యాదవ్​..

మహిళా క్రికెటర్ల తాజా టీ20 ర్యాంకింగ్స్​ను ప్రకటించింది ఐసీసీ. బౌలింగ్​ విభాగంలో టీమ్​ఇండియా లెఫ్ట్​ఆర్మ్​ స్పిన్నర్​ రాధాయాదవ్​ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి పదమూడో స్థానానికి చేరుకుంది. శ్రీలంకపై 2-1తేడాతో టీమ్​ఇండియా సిరీస్​ గెలవడంలో నాలుగు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించడంతో ఈ ఫీట్​ను అందుకుంది.

  • మాధవన్​ను అలా చూసి షాకైన సూర్య..

సీనియర్​ హీరో మాధవన్​ను చూసి అమిత ఆశ్చర్యానికి గురయ్యారు కథానాయకుడు సూర్య. 'ఇది కలా? నిజమా' అన్నట్లు నోరెళ్లబెట్టారు. అసలేం జరిగిందటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.