ETV Bharat / city

ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

top ten news in telangana today
ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు
author img

By

Published : Dec 17, 2021, 5:52 AM IST

Updated : Dec 17, 2021, 9:59 PM IST

21:47 December 17

టాప్​ న్యూస్​ @10PM

  • 'ఏప్రిల్‌లో మరోసారి ఫస్టియర్‌ పరీక్షలు రాయొచ్చు'

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఈ ఏడాది ఈ సారి సప్లిమెంటరీ పరీక్షలు లేనట్లే..! ఈ మేరకు ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో.... ఫెయిల్‌ అయిన తొలి ఏడాది విద్యార్థులు.. ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షల్లోనే రాయాల్సి ఉంటుదని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఫలితాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని బోర్డు కార్యదర్శి జలీల్‌ స్పష్టం చేశారు.

  • 'అది అనాలోచిత నిర్ణయానికి నిదర్శనం'

Bandi Sanjay on employees allocation: ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం జారీ చేసిన 317జీవో ప్రభుత్వ అనాలోచి నిర్ణయానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు.. స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

  • గజగజ వణుకుతున్న తెలంగాణ

రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న చలితీవ్రత పెరుగుతోంది. ఉదయంతో పోలిస్తే రాత్రిళ్లు చలి తీవ్రత మరీ ఎక్కువవుతోంది. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రతతో ప్రయాణికులు, ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • పబ్​జీ మోజులో.. సొంతింట్లోనే రూ.8లక్షలు చోరీ!

PUBG Addiction: భారత్​లో విపరీతమైన ఆదరణ ఉన్న ఆన్​లైన్​ గేమ్​ పబ్​జీ.. వారిని బానిసలుగా మార్చింది. ఆటలో నిమగ్నమై.. సొంత ఇంట్లోనే రూ. 8 లక్షలు కాజేశారు అన్నదమ్ములు. అసలు విషయం తెలిసి వాళ్ల తండ్రి షాకయ్యాడు. తమిళనాడు చెన్నైలో జరిగిందీ ఘటన.

  • నిక్ సతీమణి ట్యాగ్.. ప్రియాంక చోప్రా ఆగ్రహం

అంతర్జాతీయ మీడియా తనను నిక్ సతీమణి అంటూ రాయడంపై నటి ప్రియాంక చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు మాత్రమే ఎందుకు ఇలా అని ఆవేదన చెందారు.

20:59 December 17

టాప్​ న్యూస్​ @9PM

  • ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్​ ఫస్టియర్​ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో వరుణ్(19) ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

  • రేపు దిల్లీకి మంత్రుల బృందం

దిల్లీకి వెళ్లి కేంద్రాన్ని మరోసారి నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రేపు దిల్లీకి మంత్రుల బృందం వెళ్లనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెరాస విస్తృతస్థాయి భేటీలో.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రైవేటీకరణ, ఇతర అంశాలపై భేటీలో చర్చించిన సీఎం.. కేంద్రంపై పోరులో భవిష్యత్తు కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం చర్చించారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు చేయాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు.

  • ఆన్​లైన్ క్లాసు మధ్యలో పేలిన ఫోన్

Phone Blast: ఆన్​లైన్ క్లాసు జరుగుతుండగా ఓ విద్యార్థి చేతిలోని ఫోన్ పేలింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

  • ట్రాఫిక్​ పోలీస్​కు థ్యాంక్స్​ చెప్పిన సచిన్​

Sachin Tendulkar Thanks Police: టీమ్​ఇండియా దిగ్గజం సచిన్​ తెందుల్కర్.. ఓ ట్రాఫిక్​ పోలీస్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి వారివల్లే ప్రపంచం అద్భుతంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ సంఘటనను షేర్​ చేశారు మాస్టర్​ బ్లాస్టర్​​. మరి ఆ కథేంటి?

  • 'హిట్ 2' గ్లింప్స్​తో అడివి శేష్ సర్​ప్రైజ్​

Adivi sesh birthday: 'మేజర్' సినిమాతో బిజీగా ఉన్న అడివి శేష్.. మరోవైపు 'హిట్​ 2' కూడా పూర్తి చేశారు. శుక్రవారం ఆ చిత్ర గ్లింప్స్​ను రిలీజ్ చేశారు.

19:51 December 17

టాప్​ న్యూస్​ @8PM

  • రూ.1500 కోట్లు మోసం

హైదరాబాద్​లో ఇండస్ వివా కంపెనీ వ్యవస్థాపకులు అంజారంద్, అభిలాష్​లను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో రూ.1500 కోట్లు మోసం చేసినట్లు అధికారులు తేల్చారు. గచ్చిబౌలిలో 9 నెలల క్రితం నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

  • చనిపోయాడని అంత్యక్రియలు.. భార్యకు మళ్లీ పెళ్లి.. కానీ 12ఏళ్ల తర్వాత...

Man found alive after 12 years: పన్నెండేళ్ల క్రితం అతడు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతడి కోసం చాలా రోజులపాటు ఎక్కడెక్కడో వెతికారు ఆ కుటుంబసభ్యులు. ఎంత వెతికినా.. వారికి నిరాశే మిగిలింది. ఇక అతడు చనిపోయాడని భావించి అతడికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అతని భార్య మళ్లీ పెళ్లి చేసుకుంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా వారికి అతడి ఆచూకీ తెలిసింది. ఇంతకీ ఏం జరిగింది?

  • పోలీసులకు 'సోలార్'​ గొడుగులు

Solar Traffic Umbrellas: మండుతున్న ఎండల్లో గంటల తరబడి నిల్చొని విధులు నిర్వర్తించడం ట్రాఫిక్​ పోలీసులకు చాలా కష్టంగా మారింది. వీరి కోసం కేరళ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రత్యేక సదుపాయాలతో కూడిన సౌరగొడుగులను అందిస్తోంది.

  • అమెజాన్​కు రూ.202 కోట్ల ఫైన్

CCI Penalty On Amazon: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ సంస్థకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) రూ.202 కోట్ల జరిమానా విధించింది. ఫ్యూచర్ గ్రూపుతో ఒప్పందానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

  • 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. వాళ్లే అతిథులు

రామోజీ ఫిల్మ్​సిటీలో 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 23న జరగనుంది. అయితే ఈ ఈవెంట్​కు అభిమానులే అతిథులని చిత్రబృందం వెల్లడించింది. అలానే ఈ కార్యక్రమం జరిగే చోటు వింటేజ్​ యూరప్​ సెట్​లా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

18:54 December 17

టాప్​ న్యూస్​ @7PM

  • కేసీఆర్‌ పర్యటన తేదీల్లో మార్పులు

సీఎం కేసీఆర్‌ రెండు జిల్లాల పర్యటన తేదీల్లో మార్పులు జరిగాయి. ఈనెల 23న వనపర్తి జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.

  • వివాహితపై అత్యాచారం

వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని ఓ వివాహితపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. వివాహితపై ఇస్మాయిల్‌, మరో బాలుడు అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్​లోని బోరబండలో ఆలస్యంగా వెలుగుచూసింది.

  • ఒమిక్రాన్​పై ప్రభుత్వ చర్యలేంటి?

Omicron Cases in Telangana: రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరోకరు ఈ కొత్త స్ట్రెయిన్​ బారినపడగా ఇప్పటి వరకు ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య 8కి చేరింది. అయితే విదేశాల నుంచి వస్తున్న వారిలో టెస్టింగ్ కొరవడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ర్యాండమ్ సాంపిళ్ల సేకరణ పద్ధతి సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? కొత్తవేరియంట్​ని గుర్తించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో ఇప్పుడు చూద్దాం.

  • భూప్రపంచంలో 1,306 కాళ్లు ఉన్న ఏకైక జీవి ఇదే..

First true millipede: ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 1,306 కాళ్లున్న అరుదైన మిలపీడ్​ను కనుగొన్నారు. 13,000కుపైగా జాతులున్న ఈ జీవుల్లో వెయ్యికిపైగా కాళ్లున్న దానిని గుర్తించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

  • 'మాస్​ సినిమాకు సరికొత్త డెఫినిషన్​ 'పుష్ప''

Pushpa movie reaction: బన్నీ 'పుష్ప' సినిమా సాధారణ అభిమానులనే కాకుండా టాలీవుడ్​ డైరెక్టర్లను మెప్పించింది. ఈ సందర్భంగా తమ తమ అభిప్రాయాలను పలువురు దర్శకులు వెల్లడించారు.

18:18 December 17

టాప్​ న్యూస్​ @6PM

  • రేపు దిల్లీకి మంత్రుల బృందం

రేపు దిల్లీకి మంత్రుల బృందం వెళ్లాలని తెరాస విస్తృత స్థాయి సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయంధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులను రాష్ట్ర మంత్రులు కలవనున్నారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20న ఆందోళనలు చేయాలని సీఎం నిర్ణయించారు.

  • త్వరలోనే కొత్త సీడీఎస్​ ఎంపిక

New CDS appointment: కొత్త సీడీఎస్ ఎంపికకు సంబంధించి అర్హుల జాబితాను త్వరలోనే రాజ్​నాథ్​ సింగ్​ వద్దకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయన ఆమోదం తర్వాత తుది నిర్ణయం కేబినెట్ నియామకాల కమిటీ తీసుకుంటుందన్నారు.

  • 'డెల్టా కంటే జోరుగా ఒమిక్రాన్ వ్యాప్తి'

Omicron Cases India: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 100 దాటిందని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. అత్యవసరం కాని ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేస్తే మంచిదని అభిప్రాయపడింది. కొత్త సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించింది.

  • పాక్​ను చిత్తుచేసిన భారత జట్టు

Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో పాకిస్థాన్​పై భారత్‌ విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై 3-1 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఈ విజయంతో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.

  • 'చచ్చిపోతాడని ఆ డైరెక్టర్​ను కొట్టకుండా వదిలేశా'

Ali tho saradaga: సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్య.. ఓ డైరెక్టర్​ను కొట్టకుండా వదిలేశారు. అలానే నటిగా మారుతానని అస్సలు అనుకోలేదని 'ఆలీతో సరదాగా'షోలో చెప్పారు. ఈ ఎపిసోడ్​ డిసెంబరు 20న ఈటీవీలో ప్రసారం కానుంది. అంతవరకు ఈ ప్రోమో చూసేయండి.

16:52 December 17

టాప్​ న్యూస్​ @5PM

  • ఒమిక్రాన్‌ బాధితుడి చిరునామా గుర్తింపులో ఇబ్బందులు

హైదరాబాద్‌లో ఒమిక్రాన్‌ బాధితుడి ఆచూకీ కోసం బంజారాహిల్స్​ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. నిన్న గుర్తించిన ఒమిక్రాన్‌ బాధితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కెన్యా నుంచి వచ్చిన 44 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్‌ను గుర్తించారు.

  • నగరంలో గుప్పుమన్న గంజాయి

హైదరాబాద్‌లో రూ.90 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ నుంచి రాష్ట్రానికి తరలిస్తుండగా గంజాయి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న 10 మందిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.

  • దేశంలో వంద దాటిన ఒమిక్రాన్‌ కేసులు

Omicron Cases India: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 100 దాటిందని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది.

  • మరో టోర్నీలో సింధు ఓటమి

BWF World Championships: ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​ క్వార్టర్​ ఫైనల్స్​లో భారత స్టార్ షట్లర్​ పీవీ సింధు ఓటమి పాలైంది. చైనాకు చెందిన తై జు యింగ్​(చైనీస్​ తైపీ)​ చేతిలో వరుస సెట్లలో 21-17, 21-13 తేడాతో ఓడిపోయింది.

  • 'పుష్ప' ఆ ఓటీటీలోనే రిలీజ్

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, పుష్ప, శ్యామ్​సింగరాయ్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

15:55 December 17

టాప్​ న్యూస్​ @4PM

  • CCTV Video: దొంగల బీభత్సం

Chain Snatchers in Delhi: ఓ మహిళ మొబైల్ ఫోన్​ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు దుండగులు. ప్రతిఘటించిన ఆమెను చాలా దూరం ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో వేగంగా మరో వాహనాన్ని ఢీకొట్టి.. రోడ్డుపై పడేసి అక్కడి నుంచి తప్పించుకుపోయారు. గమనించిన స్థానికులు ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగింది.

  • ఆరోగ్య బీమా టాపప్‌ చేయించారా?

Health Insurance: కొవిడ్‌-19 భయాలు ఇంకా వదలనే లేదు. మళ్లీ 'ఒమిక్రాన్‌' ఆందోళనలు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ దీన్ని ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆర్థిక విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఆరోగ్య బీమా విషయంలో. ఇప్పటికే ఉన్న పాలసీని ఇప్పటికిప్పుడు మార్చడం సాధ్యం కాదు కాబట్టి, దానికి అదనపు రక్షణగా టాపప్‌ పాలసీలను ఎంచుకోవడం ఇప్పుడు అవసరంగా కనిపిస్తోంది.

  • కుప్పకూలిన మార్కెట్లు

Stock Market News: దేశీయ స్టాక్​ మార్కెట్ సూచీలు వారాంతంలో కుప్పకూలాయి. శుక్రవారం సెషన్​లో సెన్సెక్స్ 890 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లు పతనమయ్యాయి.

  • దక్షిణాఫ్రికాకు టీమ్​ఇండియా

Jadeja Rohit Sharma At NCA: టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా బెంగళూరులోని నేషనల్​ క్రికెట్​ అకాడమీకి చేరుకున్నారు. గాయాల కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన వీరిద్దరూ.. ఫిట్​నెస్​పై దృష్టి పెట్టారు.

  • పుష్ప సినిమాపై పబ్లిక్​ టాక్​ ఏంటంటే?

Pushpa Public Talk: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' శుక్రవారం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. సుకుమార్​ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్​గా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ రివ్యూస్​​ వస్తున్నాయి. అయితే థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్ ఎలా ఉందో మీరే చూసేయండి.

14:55 December 17

టాప్​ న్యూస్​ @3PM

  • తెరాస విస్తృతస్థాయి సమావేశం

Trs Meeting with KCR: కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉద్ధృతం చేసేందుకు తెరాస సిద్ధమవుతోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులందరితో కీలకభేటీ నిర్వహించారు. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణభవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు.. కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, బొగ్గుగనుల ప్రైవేటీకరణ అంశాలతోపాటు మోదీ సర్కారుపై అనుసరించాల్సిన తీరుపై శ్రేణులకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.

  • కాంగ్రెస్​ ఎమ్మెల్యే 'అత్యాచారం' వ్యాఖ్యలపై దుమారం

అత్యాచారంపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్​ కేఆర్​ రమేశ్​ కుమార్​ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతల సైతం విమర్శలు గుప్పించారు. చట్టసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటుగా పేర్కొన్నారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ.

  • గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​కు తుది వీడ్కోలు

Group Captain Varun: గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ అంత్యక్రియలను ప్రభుత్వ, సైనిక లాంఛనాల మధ్య శుక్రవారం నిర్వహించారు. హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్​.. 8 రోజులు మృత్యువుతో పోరాడి ఈ నెల 15న కన్నుమూశారు.

  • కూలిన టాయిలెట్​ గోడ.. ముగ్గురు విద్యార్థులు మృతి

Wall collapse Tamil Nadu: పురాతన పాఠశాలలోని ముత్రశాల గోడ కూలిపోయి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తమిళనాడు తిరునెల్వేలిలో జరిగింది. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

  • అక్కడ నవ్వులు, ఏడుపులు బంద్​- ఉల్లంఘిస్తే అంతే సంగతులు!

North Korea Laughing Ban: ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ మరణించి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఓ విచిత్ర ఆంక్షలను అమలు చేసింది ఆ దేశం. 11 రోజుల పాటు నవ్వొద్దు, తాగొద్దు, వేడుకలు చేసుకోవద్దని ప్రజలను ఆదేశించింది.

13:51 December 17

టాప్​టెన్ న్యూస్@ 2PM

  • 'భారత్​కు కావాల్సింది వికాసం.. విప్లవం కాదు'

Mayors Conference 2021: వారణాసి వేదికగా జరుగుతున్న మేయర్స్​ కాన్ఫరెన్స్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్​కు వికాసం అవసరమని, విప్లవం కాదని వ్యాఖ్యానించారు. స్వచ్ఛత అభియాన్​ పట్ల నిర్లక్ష్యం వహించిన నగరాల జాబితా తయారు చేసి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

  • భవిష్యత్తులో సైబర్ యుద్ధాలే...

KTR Inaugurates KCWC: రాయదుర్గంలో కొటెలిజెంట్ సైబర్ వారియర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కొటేలిజెంట్ సెంటర్‌ ద్వారా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నారు.

  • ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత...

Protest at intermediate board : హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఫలితాల తీరును నిరసిస్తూ.... విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నేతలు ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

  • పవన్​ చిత్రం నుంచి ఆమె ఔట్​..

Pawan Kalyan: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం నుంచి బాలీవుడ్​ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో మరో హిందీ నటి నర్గీస్ ఫక్రీని చిత్రబృందం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

  • టీమ్​ఇండియాకు సచిన్​ సేవలు..!

Ganguly on Sachin: టీమ్​ఇండియా హెడ్​ కోచ్​గా రాహుల్​ ద్రవిడ్​, ఎన్​సీఏ అధ్యక్షుడిగా వీవీఎస్​ లక్ష్మణ్​ ఎంపికైన అనంతరం భారత జట్టుకు సచిన్​ సేవలందిస్తాడన్న వార్తలు విస్తృతమయ్యాయి. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ ఏమన్నాడంటే..

13:21 December 17

టాప్​టెన్ న్యూస్@ 1PM

  • రాష్ట్రంలో 8కి చేరిన ఒమిక్రాన్ కేసులు

Omicron Cases in Telangana: తెలంగాణలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరొకరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కానీ ఇప్పటివరకూ ఒమిక్రాన్‌ సామూహిక వ్యాప్తి లేదని ప్రజారోగ్య సంచాలకులు​ శ్రీనివాసరావు తెలిపారు. నాన్​ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ సోకిందని తెలిపారు.

  • రాయలసీమ ఎత్తిపోతల చేపట్టవద్దు..!

NGT Verdict: అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్ద ఎన్‌జీటీ స్పష్టం చేసింది.

  • పట్టాలు తప్పిన రైలు- నక్సల్స్​ పనేనా?

Train Derailment: ఛత్తీస్​గఢ్​లో 17 బోగీల గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. ​భాన్సీ-కమలూర్​ రైల్వే స్టేషన్ల మధ్య రైలు అదుపు తప్పడం వల్ల బోగీలు ఒకదానికొకటి ఢీకొని పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

  • పుష్ప- ది రైజ్.. బన్నీ-సుక్కు అదరగొట్టారా?.

ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' భారీ అంచనాల నడుమ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సుకుమార్​తో కలిసి బన్నీ మరోసారి ప్రేక్షకులను మెప్పించాడా? సినిమా ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుందో చూసేయండి.

  • కోహ్లీ​పై వార్నర్​ కంప్లైంట్..

David Warner Virat Kohli: టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ ఇన్​స్టా వేదికగా ఓ వీడియో పోస్ట్​ చేశాడు. ఓ యాడ్​లో భాగంగా విరాట్​ డ్యాన్స్ చేస్తూ కనిపించిన ఈ పోస్ట్​పై ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్ వార్నర్ స్పందించాడు.

11:57 December 17

టాప్​టెన్ న్యూస్@ 12PM

  • మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం

Highest Civilian Award of Bhutan: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్​. కరోనా విపత్తు వేళ మోదీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నట్లు పేర్కొంది.

  • 'పెళ్లి నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆరే'

Double Bedroom House Inauguration : రెండు పడక గదుల ఇళ్ల పథకంలో భాగంగా పేదలకు రూ.40 లక్షలు విలువ చేసే ఇళ్లను ఉచితంగా అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. కుల మతాలకతీతంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం జరుగుతోందని చెప్పారు.

  • తాగిన మైకంలో దొంగ అనుకుని..

Hotel Moghuls Paradise Incident: మద్యం మత్తులో ఓ వ్యక్తిని దొంగగా భావించి చితకబాదటంతో అతను మృతి చెందిన ఘటన కెేపీహెచ్​బి కాలనీలో చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన రాజేశ్ మాదాపూర్​లో కుటుంబంతో సహా నివసిస్తూ, భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

  • తమ పొలంలోకి నీళ్లు రానివ్వొద్దన్నందుకు కాల్పులు

పంట భూమిలోకి నీరు తరలించే అంశంపై చెలరేగిన వివాదం ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. ఈసంఘటన ఉత్తర్​ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. నిందితులు పరారీలో ఉన్నారు.

  • 'పుష్ప' రెండో భాగం టైటిల్ ఇదే!

Pushpa Part 2 Title: పుష్ప పార్ట్​ 1 దేశవ్యాప్తంగా శుక్రవారం థియేటర్లలో విడుదలై భారీ స్పందన పొందుతోంది. అల్లు అర్జున్ వన్​ మ్యాన్​ షోతో అదరగొట్టాడని రివ్యూలు వస్తున్నాయి. 'పుష్ప: ది రైజ్'​ అనే పేరుతో ఈ చిత్రం విడుదల కాగా, రెండో భాగానికి 'పుష్ప: ది రూల్​' అని పెట్టినట్లు సమాచారం.

10:49 December 17

టాప్​టెన్ న్యూస్@ 11AM

  • పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన సీఎం

తెలంగాణ ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్​కు ఆకుల లలితను నియమించగా...తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్​ను నియమించారు.

  • 250 రైతు కుటుంబాల కన్నీటి కథలు..

Deceased Farmers Families : సాగు సంక్షోభం, అప్పుల బాధలతో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో మొదలైన రైతుల చావులు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆగడంలేదు. ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డునపడి దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతోన్నాయి.

  • శిథిలావస్థలో వారసత్వ కట్టడాలు..

Historic Monuments : భాగ్యనగరంలో ఎన్నో కట్టడాలు మెరుగులు దిద్ది పునర్వైభవమిస్తామన్నా.. పాలకుల మాటలు గాల్లో కలిసిపోతుండగా.. నేలమట్టమయ్యే దశలో బేల చూపులు చూస్తున్నాయీ చారిత్రక సౌధాలు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న కలిగిన కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

  • ‘అఖండ’పై అర్చకుడి కామెంట్స్

Priest Rangarajan on Akhanda : అఖండ సినిమాపై హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మానికి ఎంత నష్టం జరుగుతోందోనని ప్రత్యక్షంగా చూపించారని పేర్కొన్నారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అన్నారు.

  • టీ20ల్లో ఆ రికార్డ్​ సాధించిన పాక్​ క్రికెటర్..

Mohammad Rizwan T20 Record: పాకిస్థాన్ ఓపెనర్​ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్​ అరుదైన ఫీట్​ సాధించాడు. వెస్టిండీస్​తో చివరి టీ20 మ్యాచ్​లో భాగంగా ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు.

09:47 December 17

టాప్​టెన్ న్యూస్@ 10AM

  • దేశంలో కొత్తగా 7,447 కరోనా కేసులు

Covid Cases in India: దేశంలో కొత్తగా 7,447 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 391 మంది వైరస్​కు బలయ్యారు. గురువారం 70,46,805 మందికి టీకాలు వేశారు.

  • తల్లిదండ్రులను నరికి చంపిన బాలుడు!

Minor Killed Parents: నిద్రిస్తున్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు ఓ బాలుడు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

  • తక్కువ మార్కులొచ్చాయని..

ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని నల్గొండ జిల్లా గాంధీనగర్​కు చెందిన జాహ్నవి(16) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఘటనాస్థలానికి వెళ్లారు. తమ కళ్లముందు తిరిగిన కుమార్తె ముక్కలవ్వడం చూసి గుండెలవిసేలా రోదించారు.

  • 'పుష్ప'లో బన్నీ ఎక్కడా తగ్గేదేలే..!

Pushpa Twitter Review: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'కు భారీ స్పందన లభిస్తోంది. బన్నీ అదిరిపోయే ప్రదర్శన చేశాడట. ఇక క్లైమాక్స్​ మరో స్థాయిలో ఉందంటూ ట్విట్టర్​లో సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 'పుష్ప' ఎలా ఉందో మీరూ చదివేయండి.

  • 'సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం.. కానీ'

HCA News: హెచ్​సీఏ పరిపాలన వ్యవహారాల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తామన్న సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఎపెక్స్​ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. అయితే.. ఎపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

08:49 December 17

టాప్​టెన్ న్యూస్@ 9AM

  • సోనియా గాంధీతో డీఎస్ భేటీ..

D Srinivas to Join Congress : తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో కాంగ్రెస్​లో చేరనున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం ఆయన దిల్లీలో సోనియా గాంధీని కలిశారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపగా.. ఆమె అంగీకారం తెలిపారు.

  • ప్రియుడిపై ప్రియురాలి కాల్పులు..

తమ మధ్య పెరుగుతున్న దూరాన్ని సహించలేని ఓ మహిళ ప్రియుడిపై కాల్పులు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. బంగాల్​లో జరిగిన ఈ ఘటనలో ప్రియుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

  • అదుపుతప్పిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి

Tractor Bolta Jagtial : ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇంజిన్ కింద ఇరుక్కుని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

  • వలపు వలతో దోచుకుంటున్నారు..

Honey Trap Cases: హనీట్రాప్​.. ఈ మధ్య తరచూ వినిపిస్తున్న పదం. 60 ఏళ్ల వృద్ధుల నుంచి 18 ఏళ్ల కుర్రాళ్ల వరకు ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. వలపు వల వేసి.. అందినకాడికి దోచేసి.. నిలువునా ముంచేస్తున్నా.. పరువుపోతుందనే భయంతో కొందరు నోరు కూడా మెదపడంలేదు. వారి భయాన్నే సైబర్​ నేరగాళ్లు ఆయుధంగా మలచుకుంటూ.. మరింత రెచ్చిపోతున్నారు.

  • సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా స్టెయిన్‌

Dale Steyn SRH: సన్​రైజర్స్​ హైదరాబాద్ బౌలింగ్ కోచ్​ బాధ్యతలు స్వీకరించనున్నాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్. టామ్‌ మూడీ మళ్లీ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు లఖ్​నవూ జట్టు ప్రధాన కోచ్​ రేసులో జింజాబ్వే మాజీ కెప్టెన్‌ ఆండీ ఫ్లవర్‌ ఉన్నట్లు సమాచారం.

08:01 December 17

టాప్​టెన్ న్యూస్@ 8AM

  • సొంత వనరులతోనే కాళేశ్వరం నిర్మాణం

parliament on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో నిర్మిస్తోందని కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. ఇప్పటి వరకు 80వేల కోట్లు ఖర్చు చేసి 83 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేసిందని తెలిపారు.

  • మరో రెండు వారాల్లో ట్రై సర్వీస్​ విచారణ పూర్తి!

CDS Chopper Crash: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ట్రై సర్వీస్​ విచారణ మరో రెండు వారాల్లోగా ముగుస్తుందని ఉన్నతాధికారులు చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు బృందం సాక్షుల నుంచి వాగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  • పాజిటివ్ తేలినా పర్యవేక్షణ లేదు

Telangana Corona Cases Today : రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ నెమ్మదిగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన రాష్ట్ర వైద్యశాఖ అలసత్వం ప్రదర్శిస్తోందనే విమర్శలున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చి కరోనా బారిన పడిన వారి కదలికలపై నిఘా వేయడంలో విఫలమైందనే ఆరోపణలొస్తున్నాయి.

  • నవజాత శిశువులకు ఆసుపత్రుల్లోనే ఆధార్‌!

Children Aadhaar: అప్పుడే పుట్టిన పిల్లలకు ఆస్పత్రిలోనే వారి ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తో ఆధార్‌ కార్డు జారీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్‌ అవసరం లేకుండానే ఆధార్‌ కార్డు జారీ చేసే ప్రక్రియ త్వరలో అందుబాటులోకి రానుంది.

  • వాటి కోసం మూడేళ్లు కష్టపడ్డాం

Shyam Singha Roy: 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా కోసం 70వ దశకం నాటి బంగాల్‌ పరిస్థితులను రీక్రియేట్ చేసేందుకు మూడేళ్ల పాటు రీసెర్చ్‌ చేసినట్లు చెప్పారు ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్ల. అప్పటి పరిస్థితుల్ని చూపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు.

06:56 December 17

టాప్​టెన్ న్యూస్@ 7AM

  • 49 శాతమే పాసయ్యారు

TS Intermediate Pass Percentage 2021 : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణత 11శాతం తగ్గింది. పరీక్షలపై అస్పష్టత.. కరోనా విలయంతో ఆన్​లైన్ తరగతుల గందరగోళమే ఉత్తీర్ణత తగ్గడానికి గల కారణాలని నిపుణులు భావిస్తున్నారు.

  • చిన్నారి కథ సుఖాంతం

Borewell Baby Rescue Operation: బోరుబావిలో పడిపోయిన ఏడాదిన్నర చిన్నారిని సురక్షితంగా వెలికితీశారు అధికారులు. చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

  • నోటి ద్వారా కొవిడ్​ టీకా

Oral Drug Covid: ప్రపంచాన్ని ఎన్నో రోజులుగా పట్టి పీడిస్తున్న కరోనాకు నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్​ రెడీ అవుతోంది. దీనిని అమెరికా- ఇజ్రాయెలుకు చెందిన ఒరా వ్యాక్స్​ అనే సంస్థ రూపొందిస్తుంది.

  • పాకిస్థాన్​తో భారత్ ఢీ

Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్​లో నేడు(డిసెంబర్ 17) పాకిస్థాన్​తో తలపడనుంది భారత జట్టు. గత మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై 9-0తో గెలిచిన భారత్​.. పాక్​పై పైచేయి సాధించాలని చూస్తోంది.

  • ఎందుకంత స్పెషల్?

Pushpa movie: ''పుష్ప'.. పుష్పరాజ్ నీ అవ్వా తగ్గేదేలే' అంటూ థియేటర్లలోకి వచ్చిన బన్నీ.. ఈ సినిమాతో చాలా ప్రయోగాలే చేశారు. అలానే ఈ చిత్రంలో చాలా విశేషాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటి? దాని సంగతేంటి?

05:22 December 17

టాప్​టెన్ న్యూస్@ 6AM

  • తెరాస కీలక సమావేశం

Trs Meeting with KCR: కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉద్ధృతం చేసేందుకు తెరాస సిద్ధమవుతోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులందరితో కీలకభేటీ నిర్వహించనుంది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణభవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు.. కీలక నేతలు హాజరుకానున్నారు.

  • ఏడుకు చేరిన సంఖ్య

రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇవాళ మరో నలుగురిలో ఒమిక్రాన్‌ వేరియంట్​ను గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించగా.. భారత్‌కు చెందిన మరో వ్యక్తిలో వేరియంట్‌ను నిర్ధారించారు

  • ధాన్యం కొనుగోళ్లలో ఆల్​టైమ్​ రికార్డు

Gangula on paddy: రాష్ట్రంలో వానా కాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. వానా కాలం కొనుగోళ్లలో పౌరసరఫరాల శాఖ ఆల్‌టైం రికార్డు సృష్టించిందని మంత్రి ప్రకటించారు.

  • మొదటి సంవత్సరంలో తగ్గిన ఉత్తీర్ణత

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కేవలం 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 59 వేల 242 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. అందులో జనరల్ విద్యార్థులు 4 లక్షల 9 వేల 911 కాగా... ఒకేషనల్ విద్యార్థులు 49 వేల 331 మంది ఉన్నారు.

  • ఔటర్ రింగ్‌రోడ్‌పై విద్యుత్​ వెలుగులు

led lighting on ORR : మెరుగైన సౌకర్యాల ద్వారా మరిన్ని పెట్టుబడులు వస్తాయని తద్వారా రాష్ట్ర అభివృద్ధి మరింత మెరుగు పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని బాహుబలి రహదారి వద్ద వంద కోట్లకు పైగా నిధులు వెచ్చించి హెచ్ఎండిఏ ఏర్పాటుచేసిన ఎల్​ఈడీ విద్యుత్ లైట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

  • సంక్షోభంలో పరిశ్రమలు

corona effect on Industries: కరోనా ప్రభావం నుంచి పారిశ్రామికవేత్తలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. పెరిగిన ముడిసరకుల ధరలు.. తగ్గిన ఆర్డర్లు, ఉత్పత్తులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారికి రుణసాయం అందించడానికి బ్యాంకుల నిరాసక్తత చూపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ రాయితీల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

  • ఐదుగురు కార్మికులు మృతి

Gujarat chemical factory blast: గుజరాత్​లోని ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు

  • పుష్పపై అల్లు అర్జున్ ఛాలెంజ్​

Pushpa movie: రాజమౌళి కన్విన్స్​ చేయడం వల్లే 'పుష్ప' పాన్ ఇండియా సినిమాగా మారిందని సుకుమార్ చెప్పారు. అలానే ప్రెస్​మీట్​ సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఓ ఛాలెంజ్ చేశారు.

  • ' వివాదాలు అంత మంచిది కాదు'

Kapil Dev On Kohli Captaincy: వివాదాలు భారత క్రికెట్‌కు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు క్రికెట్ దిగ్గజ కపిల్ దేవ్​. దక్షిణాఫ్రికా లాంటి కీలక విదేశీ పర్యటనలకు ముందు ఇలా వాదులాడుకుంటే ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపిస్తుందని అన్నారు.

  • బ్రిటన్​లో ఒక్కరోజే 88 వేల కేసులు

Covid cases: బ్రిటన్​లో ఒక్కరోజే 88 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు.

Last Updated : Dec 17, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.