- సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం
భారత న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించారు జస్టిస్ ఎన్.వి రమణ. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రైతు కుటుంబం నుంచి..
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జస్టిస్ ఎన్వి రమణ.. వీధి బడిలో చదువుకుని దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. మూడు దశాబ్దాల న్యాయవాద జీవితంలో రాజ్యాంగ, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల్లో..నిష్ణాతులుగా పేరు గడించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థలోనే మైలురాళ్లుగా నిలిచే.. అనేక తీర్పులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చారిత్రక తీర్పులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్.వి. రమణకు 2014లో సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. అప్పటి నుంచి అనేక కీలకమైన అంశాలను విచారించిన ధర్మాసనాల్లో ఆయన సభ్యులుగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు వ్యాజ్యాలు, సాయుధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు, ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం వంటి వ్యాజ్యాలపై విచారణ చేపట్టి కీలక తీర్పులు వెలువరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అన్ని ఓకే చోట
కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. టెస్టుల కోసం ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య భారీగానే ఉంటోంది. మరోవైపు కేసులు ఉప్పెనలా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. అయితే కొన్ని చోట్ల టెస్టులు, వాక్సినేషన్, చికిత్స అన్ని ఒకేచోట చేస్తుండటం చేటుగా మారుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
కొవిడ్ బారిన పడి చివరి దశలో ఆస్పత్రుల్లో చేరుతున్న అనేకమంది రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాతోపాటు ఇతరత్రా వ్యాధులున్న చాలామంది గత రెండు రోజులుగా మృత్యువాత పడ్డారు. చాలామంది ఆక్సిజన్ శాతం తగ్గిన తరువాతే ఆస్పత్రులకు రావడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఒక్క డోసు పొందినా ఇన్‌ఫెక్షన్ ఉద్ధృతికి కళ్లెం!
ఆక్స్‌ఫర్డ్ లేదా ఫైజర్ సంస్థలకు చెందిన కొవిడ్ టీకాను ఒక డోసు మేర పొందినా.. కరోనా ఇన్‌ఫెక్షన్లు 65 శాతం మేర తగ్గుతాయని ఒక అధ్యయనం పేర్కొంది. తొలి డోసు పొందిన 21 రోజుల తర్వాత సదరు వ్యక్తుల్లో రోగనిరోధక ప్రతిస్పందన వ్యవస్థ మెరుగుపడుతోందని తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సెప్టెంబరు కల్లా కొవావ్యాక్స్ టీకా!
సెప్టెంబర్ కల్లా 'కొవావ్యాక్స్' టీకా అత్యవసర వినియోగానికి అనుమతి పొందేందుకు సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ అభివృద్ధి చేసిన టీకాయే కొవావ్యాక్స్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. మరికొందరి పేర్లనూ ఎఫ్ఐఆర్లో చేర్చింది. అనంతరం, దేశ్‌ముఖ్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత రికర్వ్ మహిళా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పానిష్ బృందాన్ని 6-0 తేడాతో ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఉత్తమ దర్శకధీరులు?
ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన ఐదుగురు డైరెక్టర్లలో ఉత్తమ దర్శకధీరునిగా ఎవరు నిలుస్తారో చూడాలి? అందుకు సంబంధించిన ప్రత్యేక కథనమే ఈ స్టోరి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి