- నేడే ప్రమాణ స్వీకారం
కాసేపట్లో భారత న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠాన్ని తెలుగుతేజం అధిష్టించబోతుంది. 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నేడు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వారికి టీకా ఎలా..?
వచ్చేనెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాలను అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పచ్చజెండా ఊపడంతో.. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 18-44 ఏళ్ల మధ్యవయస్కులు సుమారు 1.82 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం వీరికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత రాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కొవిడ్ శవాలతో కాసుల వేట
కరోనా మృతి చెందిన వారిని ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా భావించిన కొందరు శవాలపై కాసుల వేట ప్రారంభించారు. ఒక్కో శవం కాష్ఠం చేరేందుకు కనీసం రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా వసూలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గాలి నుంచి ఆక్సిజన్ తయారీ
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ సోకిన వారు ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టిసారించింది. గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసే మూడు ప్లాంట్లను తెలంగాణకు పంపింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్‌లలో వీటిని ఏర్పాటు చేశారు. వచ్చేవారం నుంచి ఇవి అందుబాట్లోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- దిల్లీ విలయానికి అదే కారణమా..?
దిల్లీలో కొవిడ్ మహమ్మారి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. అయితే ఈ ఆకస్మిక ఉద్ధృతికి బ్రిటన్ రకం వేరియంట్ కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నేడు, రేపు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బోటు మునిగి 130 మంది మృతి!
ఆఫ్రికా లిబియా తీరంలో బోటు మునిగింది. ఈ ఘటనలో ఐరోపాకు చెందిన 130 మంది అక్రమ వలసదారులు మృతిచెందినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఏసీలకు తగ్గని గిరాకీ
ఏసీ గదుల్లో ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనేది అపోహే అంటున్నారు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్‌బాబు. యూవీ నానోతో ఆరోగ్య భద్రత ఉంటుందని.. ఇంట్లోనూ మాస్కులు ధరిస్తే మేలని సూచిస్తున్నారాయన. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఏసీలా వాడకం తగ్గలేదని ఆయన వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సచిన్ పంచ్‌కు స్వర్ణం
ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్‌లో పురుషుల 56 కేజీల విభాగంలో సచిన్ స్వర్ణం సాధించాడు. దీంతో మొత్తం ఎనిమిది స్వర్ణాలు, మూడు కాంస్యాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్‌షిప్స్‌ను ముగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తగ్గేదే లే
రెండో దశలో కరోనా ప్రభావం చూపిస్తున్నా సరే, పలు జాగ్రత్తలతో టాలీవుడ్‌లోని సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? ఎక్కడెక్కడ సాగుతున్నాయి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి