- సర్కారు వారి ఆసరా
రాష్ట్రంలో 39,36,521 మందికి పింఛన్లు అందజేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కొత్తవాళ్లకు కూడా ఇచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆసరా ఫించన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారత్ @ 46,951
భారత్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా 46,951 కేసులు నమోదయ్యాయి. మరో 212 మంది కొవిడ్‌తో మరణించారు. 21 వేల మందికిపైగా వైరస్‌ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణ @ 337
తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొత్తగా 337 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 2,958 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రూపాయికే వైకుంఠ రథం
ఓ వ్యక్తి మరణం వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతుంది. పేద కుటుంబాల్లో.... అయినవారిని పోగొట్టుకున్న బాధలో ఉన్నవారికి... అంత్యక్రియల ఖర్చులు మరింత భారంగా మారతాయి. అలాంటి వారికి అండగా నిలుస్తోంది సదాశివపేట మున్సిపాలిటీ. రూపాయికే వైకుంఠరథం సేవలు అందిస్తూ కష్టకాలంలో తోడుగా నిలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- డ్రగ్స్ ముఠా నాయకుడు అరెస్ట్
త్రిపురలో డ్రగ్స్ ముఠా నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో రెండు ప్రాంతాల్లోనూ పోలీసులు దాడులు జరపగా.. నిందితులు పరారయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బామ్మల బడి
ప్రతి ఊర్లో రచ్చబండ ఉంటుంది. అక్కడ వృద్ధులు, ఇతరులు సరదాగా కూర్చుని కాలక్షేపం చేస్తుంటారు. కానీ.. ఓ గ్రామంలోని మహిళలు అందుకు భిన్నం. వృద్ధాప్యంలో పెన్నూ, పేపర్ చేతపట్టి చదువు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాడు చదువుకు దూరమైన వారు.. మనవలు, మనవరాళ్లను ఎత్తుకునే దశలో నేడు ఎంతో ఆసక్తిగా అక్కడికి వచ్చి అక్షరాలను నేర్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరా మహిళలు? ఆ ఊరు ఎక్కడుంది? ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మోదీ పర్యటనకు ముప్పేమీ లేదు
తమ దేశానికి రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి భద్రతపరంగా ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాకను కొందరు వ్యతిరేకించినప్పటికీ భయపడాల్సిందేమీ లేదని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- యాపిల్‌కు రూ.15 కోట్లు ఫైన్!
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు బ్రెజిల్ వినియోగదారుల ఫోరం (ప్రోకాన్-ఎస్పీ) భారీ జరిమానా విధించింది. ఐఫోన్ 12 మోడళ్లకు బాక్సులో ఛార్జర్లు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ.. రూ.15 కోట్లు ఫైన్ వేసింది. పర్యావరణ హితం పేరుతో ఐఫోన్ 12 మోడళ్లను ఛార్జర్లు, హెడ్ఫోన్లు లేకుండా విక్రయిస్తోంది యాపిల్. కొత్తగా తీసుకొచ్చే ఐఫోన్ మోడళ్లలో ఎందులోనూ ఇకపై ఛార్జర్లు ఉండవని కూడా ఇదివరకే స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఐపీఎల్ కోసం కేకేఆర్ తయార్
ఐపీఎల్ కొత్త సీజన్ కోసం సిద్ధమవుతోంది కోల్‌కతా నైట్‌రైడర్స్. ఈ సీజన్ కోసం కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు క్వారంటైన్లో ఉండనున్నారు. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వారి క్వారంటైన్‌ను ప్రారంభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అను-అర్జున్ అల్లరే అల్లరి!
నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన 'రంగ్ దే' విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల శుక్రవారం(మార్చి 26) థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న చిత్రబృందం.. హైదరాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. అనంతరం సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందమంతా సందడి చేస్తూ కనిపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి