- తెలంగాణకు ముప్పు
రాష్ట్రంలో కొవిడ్ ముప్పు తొలగిపోయిందనే భావన సరికాదనీ, ఇప్పటికీ మహమ్మారి పొంచే ఉందని వైద్యఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కొత్త కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సూచిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- దా'రుణాల'కు డైరెక్టర్..
రుణ యాప్‌ల ఆగడాలపై పోలీసులు మూలాల్లోకి వెళ్లి ఆరా తీస్తున్నప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరంపరలోనే బీటెక్ పూర్తిచేసి.. 9 రుణ కంపెనీలకు డైరెక్టరైన చిన్నబ్బ రాజశేఖర్ అరెస్ట్.. ఈ యాప్‌లకు సంబంధించిన రూ.300 కోట్లు స్తంభింపజేయడం చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పిల్లికి పాలుపోయాలంటూ..
భర్తను హత్య చేసింది. ఇంటి వెనుక సెప్టిక్ ట్యాంక్ కోసం తీసిన గొయ్యిలో పూడ్చేసింది. ఏం తెలియనట్లు పుట్టింటికి వెళ్లిపోయింది. పైన అద్దెకుండే వాళ్లకు అనుమానం వస్తే దొరికిపోతాను కదా.. ఏం చేయాలా అంటూ బాగా ఆలోచించింది. చివరకూ.. పిల్లికి పాలు పోయాలంటూ ప్రతిరోజు ఇంటికొచ్చేది. ఇలాంటి తరహాలో మరెన్నో విస్తుపోయే అంశాలు విచారణలో వెలుగు చూశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మైనర్‌పై 6 నెలలుగా అత్యాచారం
మైనర్‌పై ఏడుగురు వ్యక్తులు ఆరు నెలలకు పైగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చగా.. అత్యాచార విషయం వెలుగులోకి వచ్చింది. హరియాణాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కేరళ ఆనవాయితీ మారేనా?
కేరళ, తమిళనాడులో ఐదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మారుస్తుంటారు ప్రజలు. అయితే ఆ ఆనవాయితీని పక్కనపెడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అధికార పక్షమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కేరళలో జరగనున్న ఎన్నికలపైనే ఉంది. ప్రస్తుత పాలకపక్షం ఎల్డీఎఫ్ తిరిగి అధికారంలోకి వస్తుందా? యూడీఎఫ్‌కు అధికార బదిలీ జరుగుతుందా? లేక భాజపా మెట్రోమ్యాన్ వ్యూహం ఫలిస్తుందా? వేచి చూడాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పుదుచ్చేరిలో లెక్క తేలింది
పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల పంపకం పూర్తయింది. కాంగ్రెస్ 15 స్థానాల్లో బరిలోకి దిగుతుండగా.. డీఎంకే 13 స్థానాల్లో పోటీ చేయనుంది. మరో రెండు స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గోప్యత మీ ఇష్టమే
వినియోగదారులకు తమ లావాదేవీ సమాచారంపై అదనపు నియంత్రణ ఉండేలా గూగుల్ పే అప్డేట్ తీసుకురానుంది. లావాదేవీ చేస్తున్నప్పుడు సంబంధిత వివరాలు రికార్డ్ కావడం అన్నది పూర్తిగా వినియోగదారుడి ఇష్టమని సంస్థ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'ప్రవాస భారతీయుల కృషిని గుర్తించిన బైడెన్'
ప్రవాస భారతీయుల కృషిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గుర్తించి, గౌరవిస్తున్నారని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు. అగ్రరాజ్యం ప్రగతిలో భారతీయుల పాత్ర అసామాన్యమని ఆయన కొనియాడినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పొట్టి కప్పు దారిలో ఓ గట్టి సిరీస్
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమ్ఇండియా ఆడనున్న చివరి పొట్టి సిరీస్ ఇదే. ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుతో ఈ పోటీలో నెగ్గి.. ప్రపంచకప్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలనుకుంటోంది కోహ్లీ సేన. సొంతగడ్డపై ఆడనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం కాగా.. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రామ్‌చరణ్‌తో మరోసారి జతకట్టనున్న కియారా!
రామ్‌చరణ్, కియారా అడ్వాణీ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు వినయ విధేయ రామ సినిమాలో జోడీ కట్టిన ఈ జంట మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. దిల్‌రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ ప్రకటన.. ఇదివరకే అధికారికంగా వెలువడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి